పోషకాహారంపై అవగాహన కల్పించిన ఐసీడీఎస్ అధికారులు
ఆదిలాబాద్, ఇచ్చోడ, సెప్టెంబర్ 22 (రిపబ్లిక్ హిందుస్థాన్): పోషణ మహా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇచ్చోడ మండలం సాత్నంబర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జాదవ్ విమల పాల్గొని ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. రోజువారీ ఆహారంలో ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. భోజనానికి ముందు, భోజనం చేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. 3 నుంచి...