రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – TBD సీజన్ 5 విజయవంతం

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో శుక్రవారం రియాద్‌లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం (TBD) సీజన్–5 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు, తెలుగు సంఘాల ప్రతినిధులు, సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, నుంచి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ప్రవీణ్ కుమార్ గారు సెకండ్ సెక్రటరీ (కన్సులర్ ) తెలుగు భాషా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు....