Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నకిలీ ఆధార్, నివాస ధృవీకరణ పత్రాల కేసులో ఒకరు అరెస్ట్ – సీఐ ఇచ్చోడ రమేష్

Author
Posted By HINDUSTAN
| 08 Jan 2026, 07:27 PM | క్రైమ్
నకిలీ ఆధార్, నివాస ధృవీకరణ పత్రాల కేసులో ఒకరు అరెస్ట్ – సీఐ ఇచ్చోడ రమేష్


నకిలీ ఆధార్, నివాస ధృవీకరణ పత్రాల కేసులో ఒకరు అరెస్ట్ – సీఐ ఇచ్చోడ రమేష్

ఆదిలాబాద్ జిల్లా: సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో నర్వాడే నాగ్‌సేన్ @ నక్సన్ (30 సం., జమిడి గ్రామం, ఇచ్చోడ)ను అదుపులోకి తీసుకున్నట్లు ఇచ్చోడ సీఐ రమేష్ తెలిపారు. నిందితుడు తాను పనిచేసే ఆధార్ సెంటర్‌లో మహారాష్ట్రకు చెందిన థాడ్ రోహిత్ బాపుకు డబ్బులు తీసుకుని సిరికొండ మండల పొన్న గ్రామానికి చెందిన వాడుగా నకిలీ పత్రాలు ఇప్పించాడని తెలిపారు. ఈ పత్రాల ఆధారంగా రోహిత్ అస్సాం రైఫిల్స్ కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో విచారణలో నకిలీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 07-01-2025న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ హెచ్చరించారు.