Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై మృతి?

Author
Posted By HINDUSTAN
| 04 Feb 2025, 05:27 AM | జగిత్యాల
రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై మృతి?



జగిత్యాల జిల్లా :ఫిబ్రవరి 04
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో చోటు చేసుకుంది,

శ్వేత గతంలో వెల్గటూరు  లో  ఎస్ఐగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా డి సి ఆర్ బి లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తుండగా చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్సై శ్వేత తో పాటు బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.