Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హోలీ పండుగను సాంప్రదాయాలతో నిర్వహించుకోవాలి

Author
Posted By HINDUSTAN
| 24 Mar 2024, 04:51 PM | క్రైమ్




- జిల్లా ఎస్పీ గౌష్ ఆలం



*ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలి.*


ఇవి కూడా చదవండి


*మద్యం సేవించి వాహనాలు నడపరాదు.*



*లోతట్టు ప్రదేశాల్లో, చెరువుల్లో స్నానాలు చేయునప్పుడు జాగ్రత్తలు పాటించాలి.*



రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ :
నేడు హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు వ్యవస్థ తరపున   జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చేయడం చట్టరిత్య నేరమని తెలియజేశారు. జిల్లా ప్రజలు సురక్షితమైన రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. యువత హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లల కార్యక్రమాలను గమనిస్తూ వారికి సరైన పద్ధతినీ తెలియజేయాలని సూచించారు. వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, రేష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, లాంటి కార్యక్రమాలను యువత మానుకోవాలని సూచించారు.