Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వర్షంలో ను డ్యూటీ చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న లైన్ మెన్లు

Author
Posted By HINDUSTAN
| 18 Mar 2023, 03:30 PM | తాజా సమాచారం


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడా : ఇచ్చోడా మండలం నర్సాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న లైన్ మెన్ నారా భూమన్న , జూనియర్ లైన్ మెన్ మల్లేష్ లు భారీ వర్షం లో సైతం డ్యూటీ చేసి ఆదర్శంగా నిలిచారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంలో విద్యుత్ సరఫరా అవుతున్న సమయంలో జామిడి గ్రామంలో విద్యుత్ వైరు స్థంభం నుండి తెగి రోడ్డు మీదా పడింది. ఆ సమయం లో అక్కడ ఎవరు లేకపోవడం తో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న లైన్ మెన్ నారా భూమన్న , జూనియర్ లైన్ మెన్ మల్లేష్ లు భారీ వర్షంలో సైతం అక్కడికి చేరుకొని తెగిపడ్డ తీగను స్థంభం నుండి వేరు చేసి ప్రమాదం జరగకుండా చూశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ ను సమస్య పరిష్కారం చేసిన ఇద్దిరిని గ్రామస్తులు అభినందించారు.



ఇండ్ల మధ్యలో తెగిపడ్డ విద్యుత్ తీగ

ఇవి కూడా చదవండి