రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
Thank you for reading this post, don't forget to subscribe!జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న జడ్పీఎస్ఎస్ స్కూల్ ను సందర్శించిన షీ టీం, విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు షీ టీం విధులు మరియు సైబర్ క్రైమ్ గురించి వివరించారు.
విద్యార్థులను ఎవరైనా ఆకతాయిలు వేధించినప్పుడు, స్ట్రీట్ హారాస్మెంట్ చేసినప్పుడు చట్టరీత్యా నేరమని, అటువంటి వారికి చర్యలు తప్పవని షీ టీం స్పష్టంగా తెలియజేసింది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే షీ టీం నెంబర్ 8712659953కి కాల్ చేయాలని సూచించారు. కంప్లైంట్ చేసిన వారి పేరు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
సైబర్ క్రైమ్ గురించి కూడా అవగాహన కల్పించారు. ముఖ్యంగా స్టాక్ పెట్టుబడి మోసం, రైతుల రుణ మాఫీ నకిలీ కాల్స్, డ్రగ్ పార్శిల్ నకిలీ పోలీసు వీడియో కాల్, పార్ట్‌టైమ్ జాబ్ మోసం, లాటరీ మోసం, APK మోసం, SBI బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణ మోసం వంటి నేరాల గురించి వివరించారు. ఈ నేరాల గురించి టోల్ ఫ్రీ నంబర్ 1930 వద్ద గోల్డెన్ అవర్‌కు కాల్ చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సార్, స్కూల్ పాఠశాల హెడ్మాస్టర్ గారు, మరియు ఆదిలాబాద్ షీ టీమ్ బృందం సభ్యులు సుశీల, సత్య మోహన్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments