— ఆలస్యంగా వచ్చిన ఫైర్ ఇంజన్
— గతంలో కూడా ఫైరింజన్ వాహనం ఆలస్యంతో….
రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా అటవీశాఖ కార్యాలయం లో అక్రమంగా కలప తరలిస్తు పట్టుబడిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మండలంలోని టైగర్ జోన్ ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో ఉంచిన వాహనాలకు నిప్పు అంటుకోవడంతో వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. నిప్పు అంటుకొని దాదాపు ఇరవై నిమిషాల తర్వాత అగ్నిమాపక శాఖకు సంబంధించిన వాహనం అక్కడికి చేరుకునేలోపే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.

కూతవేటు దూరంలోనే ఉన్న అగ్నిమాపక వాహనం రావడానికి ఇంత సమయం పడుతుందా..? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ వాహనం ఆలస్యంగా రావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గతంలో కూడా ఇచ్చోడా మండల కేంద్రం లో జరిగిన రెండు అగ్నిప్రమాద ఘటనల్లో కూడా అగ్నిమాపక శాఖ వాహనం ఆలస్యం రావడం గమనర్హం.
ఫైర్ స్టేషన్ నుండి 500మీటర్లు కూడా దూరం లేని చోట నే ఇంత ఆలస్యం గా వస్తే గ్రామాల్లో ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఆఫీసర్ల నిర్లక్ష్యంతోనే మంటలు..?
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ మంటలు చెలరేగాయని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వలసిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో టైగర్ జోన్ ఫారెస్ట్ కార్యాలయానికి లోని ఖాళీ ప్రదేశంలో అటవీ శాఖ ద్వారా పట్టుబడిన వాహనాలు నిలిపిన చోటనే షాపు యజమానులు, ప్రజలు చెత్తాచెదారం వేయడంతో ఆ చెత్తను చెత్తాచెదారంను మంటలు ఒకే చెలరేగి నిల్వ ఉంచిన వాహనాలు అగ్నికి ఆహుతి అవ్వడం వల్ల ప్రభుత్వ ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని ప్రజలు అంటున్నారు.

ఆ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఖాళీ ప్రదేశం చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తే ఆ కాళీ ప్రదేశంలో చెత్తాచెదారం వేసేవారు కాదని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి ప్రభుత్వాన్నికి ఆదాయం చేకూర్చే అడవి శాఖలో పట్టుబడిన వాహనాలకు వేలంపాట వేయాలని కోరుతున్నారు.
Recent Comments