జిల్లా పాలనాధికారి రాజర్షి షా
ఆదిలాబాద్ : అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు మంగళవారం 3 వ తేదీన సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి అదిలాబాద్ చే జారీ చేయనైనది
Recent Comments