- రూ.89,160/- నగదు, 13 మొబైల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాల స్వాధీనం.విశ్వసనీయ సమాచారం మేరకు దాడి, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
ఆదిలాబాద్ : జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించకూడదనే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గత రాత్రి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మినీ బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా పేకాట ఆడుతూ 15 మంది నిందితులు పట్టుబడ్డారని ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్ తెలియజేశారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి పేకాట ముక్కలు, రూ 89,160/- నగదు, 13 మొబైల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి పేర్లు
1. Manda Adellu
2. Sriram Santosh
3. Barkunti Raju
4. Chittala Sanjeev
5. Bonagiri Ganganna
6. Ekondi Gangareddy
7. Kola Bhojanna
8. Mentapu Mahesh
9. Ineni Kiran
10. Bollu Naresh
11. Angineni Dinakar
12. Thingeni Pochanna
13. Akula Sai
14. Gunjela Pradyumn
15. Routu Sateesh
పట్టుబడ్డారని తెలిపారు. వీరిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు యువత అసాంఘిక కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక పనులకు, వ్యసనాలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.
Recent Comments