• కొత్త డైరెక్టర్, కొత్త సూపరిండెంట్ ల పైనే “ఆశలు”
• సిబ్బంది సరిగా ఉండరు సమయానికి రారు..
• డైరెక్టర్ చాంబర్లో అర్హత లేకున్నా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది
• ల్యాబ్ లలో కొరవడిన నిఘా..
• కార్యాలయంలో జూనియర్లకు పెద్దపీట …సీనియర్లకు మొండిచేయి..
• అడ్రస్ లేని పేషెంట్ కేర్ లు..
• ఇంకా భర్తీకాని సూపర్ స్పెషాలిటీ పోస్ట్ లు ఎన్నో..
• సూపర్ స్పెషాలిటీ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు ….
ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కళాశాల ప్రారంభం నుంచి వివాదాస్పదంగా ఉంది. ఒకరోజు ఒకటి మరో రోజు ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఇటీవల కొత్త గా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జయసింగ్ బాధ్యతలు చేపట్టారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ రిమ్స్ ఆస్పత్రి కళాశాలతో పాటు రిమ్స్ అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమస్యలు ఎన్నో స్వాగతం పలికాయి. సమస్య ఒక్కటే కాదు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కార్యాల విషయానికి వచ్చినట్లయితే సీనియర్లకు ఇవ్వవలసిన పోస్టులన్నీ జూనియర్ లకే ఇచ్చారు దీంతో సీనియర్లకు మొండిచేయి దక్కడంతో పాటు వారు నిరాశకు గురవుతున్నారు.

దీంతో కార్యాలయాల్లో నామమాత్రంగానే పనులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి . అంతేకాకుండా రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో గత కొన్ని సంవత్సరాల నుండి అర్హత లేకుండా, ఆఫీస్ ఆర్డర్ లేకుడనే సిసి లుగా పిఆర్వో గా పని చేస్తున్నారు. కొత్త డైరెక్టర్ వచ్చిందంటే వాలడం వారిని మంచి చేసుకుని యధావిధిగా డైరెక్టర్ చుట్టు తిరగటం అలవాటుగా మారిందని ఆరోపనలు ఉన్నాయి. వీరికి ఎలాంటి పనులు లేకున్నప్పటికీ డైరెక్టర్ చుట్టు తిరగటం డైరెక్టర్ వెళ్తే విదులకు రాకపోవడం ఇలాంటివి జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రిమ్స్ సిబ్బందితో సహా వైద్యులు సమయపాలన పాటించడం లేదని ఎవరు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాథోడ్ జైసింగ్ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల్ బుగ్గారం గ్రామనికి చేదినావారు. రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కూడా ఆదిలాబాద్ కి చెందినా వారు కావడతో రిమ్స్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని ఆదిలాబాద్ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వైద్యుల విషయానికి వస్తే సమయపాలన పాటించని వైద్యులు రిమ్స్ లో ఎందరో ఉన్నారు సెలవుల పేరుతో డుమ్మా కొట్టడం సమయానికి రాకుండా ఉండటం లాంటి మనకు కనిపిస్తున్న సమస్య ఇది. ఆస్పత్రిలో వైద్యులు కొన్ని విభాగాల్లో ఉన్నప్పటికీ వారికి సరిపోయే మందులు కానీ పరికరాలు కానీ లేవు. ఆపరేషన్ థియేటర్లో సరైన ఎక్వట్మెంట్ లేక, రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుండి గైనకాలజిస్ట్ విభాగంలో హిస్టెరెక్టమీ ఆపరేషన్లు జరగడం లేదంటే మన రిమ్స్ పని ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. గైనకాలజీ విభాగం లో అన్ని సౌకర్యాలు ఉండటంతోపాటు వైద్యులు కూడా ఉన్నప్పటికీ చిన్న ఆపరేషన్ జరగడం లేదు. దీనికి కారణం ఎవరు రిమ్స్ లో కాని ఆపరేషన్లు చిన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతుంటే నిర్లక్ష్యమే కారణమని చెప్పవచ్చు..
వార్డు ల్లో పడకలు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వార్డుల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు కు తాళాలు వేస్తున్నారు. రోగులకు ఉపయోగించవలసిన మరుగుదొడ్లు తాళాలు ఉండటం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది . మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో రోగులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ రిమ్స్ లో మాత్రం అనేక రకాల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ల్యాబ్ ల విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ లో పని చేయవలసిన కొందరు ఉద్యోగులు బినామీలకు ఏర్పాటు చేసుకొని విధులకు రావడం లేదని గతంలో జిల్లా కలెక్టర్ కు రిమ్స్ డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఫిర్యాదు చేసిన విషయంపై ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇక ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వైద్యులు కొంతమంది విధులకు రాకపోవడంతో సరైన చికిత్స అందటం లేదు. రిమ్స్ ఆస్పత్రిలో ఓపి ఇన్ పేషెంట్ ను తీసుకువెళ్లేందుకు సిబ్బంది తక్కువగా ఉన్నారని అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ పేషెంట్ కేర్ లను నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేషెంట్ల తీసుకువెళ్లేందుకు పేషెంట్ కేర్లు కనబడటం లేదు . ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న పరిస్థితి ఎవరు చెప్పేవారు లేరు . కొందరు ఉన్నత అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు నిర్వహిస్తున్నప్పటికీ విదులకు ఎగనామం పెడుతున్నారు. ఉన్నవారు పని చేస్తున్నారు.
అంతేకాదండోయ్ పేషెంట్ కేర్ లను కొన్ని విభాగాల్లో పనులు చేయించుకుంటున్నారు. పేషెంట్ కేర్ లు ఉన్న పేషెంట్లను తీసుకువెళ్లేందుకు ఎవరు లేక పోవడంతో బంధువులే పేషెంట్ లను తీసుక వెళ్ళే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు కొన్ని రకాల మందులు రోగులు బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబందనలకు విరుద్ధంగా రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జెనరిక్ దుకాణాలు ఏర్పాటు చేశారు .ఇది ఏమని అడిగే నాథుడు కూడా కరువయ్యారు. కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా నేను ఈ పోస్టు ఇంకొక ఇంకొక పోస్ట్ అంటూ వారికి వారే సృష్టించుకొని విదులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. డిప్యూటీ సూపర్నెంట్ పోస్టు లేదని అయినా పోస్టు సృష్టించి విధులు నిర్వహిస్తున్నారని పలువురు అంటున్నారు. అలాగే ఎలాంటి అర్హతలు లేకున్నా రిజిస్టర్ పోస్ట్ లో ఒక ఆసుపత్రి ప్రొఫెసర్ విధులు నిర్వహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎందుకంటే రిజిస్టర్ పోస్టు అనేది డి యం ఈ నుంచి ఆర్డర్ రావాలి, కానీ గతంలో పనిచేసిన డైరెక్టర్ ఈ పోస్ట్ ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టు అలాగే కొనసాగుతుంది . ఈ పోస్టులో ప్రొఫెసర్ ఉండడంవల్ల గైనకాలజీ లో జరగవలసిన హిస్టరెక్టమీ ఆపరేషన్ లు సిజేరియన్లు సక్రమంగా జరగడం లేదు దీంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వేలాది రూపాయలు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఆదిలాబాద్ రిమ్స్ లో నెలకొంది.
సూపర్ స్పెషాలిటీ ప్రారంభం కొరకు ప్రభుత్వం కొన్ని పోస్టులను భర్తీ చేయాలని ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. కొన్ని మాత్రమే భర్తీ చేసి మిగతా పోస్టులు భర్తీ చేయకుండానే అలాగే పరిస్థితి కొనసాగుతుంది. సూపర్స్పెషాలిటీ కొరకు ఎంపిక చేసిన ఉద్యోగులు డైరెక్టర్ ఆధ్వర్యంలో కళాశాల ఆస్పత్రిలో పని చేస్తున్నారు. కానీ కొంతమంది విధులు నిర్వహిస్తున్న మరికొంతమంది ఎక్కడ ఉన్నారో ఇంతవరకు అర్థంకాని పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఆరు నెలల క్రితం విదుల్లో తీసుకున్నారు , అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం చెల్లించే లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆరు నెలలుగా వేతనాలు లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నరు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments