రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2002- 2003లో చదువుకున్న పడవ తరగతి పూర్వ విద్యార్థులు నేడు ఆదివారం రోజు ఆత్మీయ ప లకరింపు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యకమానికి ముఖ్య అతితిగా చదువు నేర్పిన గురువులు హాజరు కావడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువు నేర్పిన గురువులను ఇన్ని రోజులు గుర్తుంచుకొని ఆత్మీయ పలకరింపు కొరకు బోధకులను! గుర్తు చేసుకొని ఆత్మీయ పలకరింపు నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అని ఏళ్ళ వేళలా మా ఆశీస్సులు ఉంటాయని వారు ఆశీర్వదించారు.
అనంతరం పూర్వ విద్యార్థులు ప్రసంగిస్తూ తమకు చదువు నేర్పిన బోధకులు పిలవగానే వచ్చినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి 2002- 2003,పడవ తరగతి విద్యార్ధి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Recent Comments