చినుకు పడితే మాయమై పోతున్న కరెంటు…
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల పరిసర ప్రాంతాల ప్రజలు చినుకు పడిన, గాలి చిన్నపాటి విచిన రొజు ఆ గ్రామాలు అంధకారం ఉంటున్నాయి. గత ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ తో తమ సమస్యలు పరిష్కారం అయిపోతయేమో అనుకున్నారు. కానీ పరిస్థితి లో ఏమాత్రం తేడా లేదు. తాజాగా కొన్ని రోజుల నుండి ఇచ్చోడా మండల ప్రజలకు వింత సమస్యతో బాధ పడుతున్నారు. ఆకాశం మేఘావృతమైన, చిన్నగా గాలి విచిన, చినుకులు పడిన గంటల తరబడి కరెంట్ మాయం మై పోతుంది. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం అయినా గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ మెరుగు పడలేదు కాబోలు…. వర్ష కాలం సమిపించిన రెండు మూడు రోజులకే ఈ విద్యుత్ కోత సమస్య వచ్చిపడింది. ప్రజలకు ఓ పక్క దోమల భయం, మరో పక్క దొంగల భయం.. మధ్యలో కరెంట్ మాయం కావడం తో ప్రజలు ఎం చేయాలో అర్థం కాకా అవస్థలు పడుతున్నారు. గతంలో ఇదే విషయం పై ఇచ్చోడా విత్యుత్ శాఖ ఏఈ ని వివరణ కోరగా పల్లె ప్రగతి లో వంద శాతం విత్యుత్ మరమ్మత్తులు, అవసరం ఉన్న చోట కొత్త స్తంబాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు పనిచేయానియాలేదు, బూతులు తిట్టి సిబ్బందిని తిరిగి పంపివేశారని అన్నారు. కానీ గ్రామ స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఎప్పుడో జమానా క్రితం వేసిన పోల్స్ పైనే వైర్ల సంఖ్యను పెంచుతు ప్రమాద శాతం పెంచుతున్నారు అధికారులు. ఇకనైనా ఉన్నతధికారులు స్పందించి విద్యుత్ కోత సమస్యను పరిష్కారం చేయాలనీ మండల ప్రజలు కోరుతున్నారు.
Recent Comments