ఇనుము స్థంబాల పై ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా నేరుగా తీగల అమరిక….
కొత్త స్థంబాలు వేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లన అధికారులు….
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగల మరియు స్థంబాల నిర్వహణ వ్యవస్థ గాడి తప్పింది. పాతతరం స్థంబాల పై పరిమితికి మించి తిగలను అధికారులు ప్రతియేటా ఏర్పటు చేస్తున్నారు. ప్రమాదం జరిగితే గాని అధికారులుల్లో చలనంరాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జామిడి గ్రామంలో ఒక పాతకాలం సిమెంట్ స్థంభం పై 22 తీగలను అమర్చారు .

కానీ ఆ స్థంభం పెచ్చులుడి లోపలి ఇనుము రాడ్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడు విరిగి పడుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. కొన్ని చోట్ల నేరుగా వైర్లు లోహపు కడ్డీలకే అమర్చారు. స్థంభం కూడా లోహముదే కావడంతో 100 % నేరుగా విద్యుత్ సరఫరా జరిగే సంభావన ఉంది. చిన్న చిన్న పిల్లలు స్తంభాలను ముడితే ఎం జరుగతదో అందరికి తెల్సిందే. తీగల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల చీనుకు పడిన కరెంటు ఉండడం లేదు.

కొత్త స్థంబాలు ఏర్పటు చేస్తామని గత సంవత్సరం 8 స్థంబాలు జామిడి కి తీసుకొచ్చిన అధికారులు ఆ తర్వాత వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్లారు. ఒక పోల్ ని గ్రామంలో ఏర్పటు చేయడానికి పెట్టి ఒక సంవత్సరం అయింది. అది అలాగే కొందరి ఇంటి ముందర పడేసి ఉంది.

సర్వీస్ చార్జీల పేరిట విద్యుత్ విద్యుత్ వినియోగం కంటే అదనంగా బిల్లును ఛార్జ్ చేస్తున్నా అధికారులు విద్యుత్ వ్యవస్థ లో ఎలాంటి పురోగతి లేకుండా ఎందుకు సర్వీస్ చార్జీలు బాడుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మలేరియా , టైపాయిడ్ , డెంగ్యూ సీజనల్ వ్యాధులు కూడా జామిడి గ్రామంలో పెరుగుతున్నయి. కరెంట్ లేకపోవడంతో ఫ్యాన్లు తిరగక దోమలు కుట్టి ఇలా అనారోగ్యనికి గురవుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించి కాలం చెల్లిన స్థంబాలు తీసి వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టాలని కోరుతున్నారు. అలాగే గ్రామం నుండి త్రిపేజ్ వైర్లను తీసి బయటి నుండి ఏర్పటు చేస్తే విద్యుత్ సరఫరా కు అంతరాయం వుండదని అంటున్నారు.
తీగల అస్తవ్యస్తంగా ఉండడం వల్ల తరుచు విద్యుత్ఘాలు జరుగుతున్నయి
తీగల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అధికారులు ప్రవైట్ వ్యక్తుల తో పనులు చేయిస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల గతం లో ఇచ్చోడ విద్యుత్ శాఖలో పనిచేసే వ్యక్తి తీగలు మరమ్మత్తు లు ( సరిచేస్తున్నా) క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ఘానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారం రోజుకు క్రితం కూడా అచ్చం అలాంటి ఘటనే పునరావృతం అయినది. ఆఫీసు నుండి ఎల్సీ తీసుకుని స్థంభం ఎక్కిన ప్రవేట్ డైలీ వెజ్ సిబ్బంది ఆ తర్వాత ఆపరేటర్ మళ్ళీ విద్యుత్ సరఫరా చెసేయడం తో విద్యుత్ఘానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments