రిపబ్లిక్ హిందుస్థాన్ , బొథ్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా ప్రవేశ పెట్టిన ఐరిష్ , వేలిముద్రల విధానం వల్ల ఎంతో మంది కి గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యం రావడం లేదు.
ఈ విషయాన్ని గమనించిన సిపిఐ నాయకులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చారు.
CPI జిల్లా సహా కార్యదర్శి గోవర్ధన్ ఆధ్వర్యంలో లో బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఎల్. నరేష్ మాట్లాడుతూ గత తొమ్మిది నెలల నుండి ఐరీస్ మరియు వేలి ముద్రలు పడని వృద్దలకు రేషన్ బియ్యం అందకా కనీసం పిడికెడు అన్నం కోసం నానా కష్టాలు పడుతున్నారని అన్నారు.
ఈ విషయం ఇటు అధికారులకు, అటు నాయకులకు తెలిసి కూడా నిమ్మకు నిరీత్తినట్టు వ్యవహరించడం బాధాకరం.

బంగారు తెలంగాణాలో, ధనిక రాష్ట్రం లో అవ్వలకు అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు. పండు వృద్దులకు రేషన్ బియ్యం అందకా నానా ఇక్కట్లు పడుతున్న ప్రభుత్వ యంత్రాంగం చచ్చిందా అన్న సందేహం కలుగక మానదని , ఇంత కంటే దారుణం మరెక్కడన్నా ఉంటదా? ఆవేదన వ్యక్తం చేశారు.
భారత రాజ్యంగం లోని ప్రకరన 21 లో ప్రతి పౌరుడికి కనీసం మూడు పూటలా అన్నం అందించడం ప్రభుత్వాల బాధ్యత కాదా?
ఇన్ని నెలలుగా రేషన్ అందకపోవడం పౌరుడి ప్రాథమిక హక్కుల ఉల్లాంఘనా కాదా? అని ప్రశ్నించారు.
ఇకనైన ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరచి ఐరీస్, వేలిముద్రలు పడని వృద్దులకు వెంటనే బియ్యం పంపిణి చేయాలనీ సిపిఐ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం లో షేక్ షాకీర్, సుమెర్ పాషా, వెంకటేష్, జవాద్, మున్సిఫ్, షహీద్ లు పాలుగోన్నారు
Recent Comments