ప్రజలు బేజారు...
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడాలో సోమవారం ప్రజలకు కష్టాల రోజు … అవును మీరు విన్నది నిజమే…! నియోజకవర్గ ములో ఇచ్చోడ సంతకు చుట్టుపక్కల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు ప్రజలు తమ పనుల నిమిత్తం వాస్తు ఉంటారు… సోమవారం రోజు మాత్రం జన తాకిడి అధికంగా ఉంటుంది. అదే అదునుగా భావించి నాయకులు , మరికొంత మంది జన సమీకరణ చేసే అవసరం లేకుండా ఎక్కువ ప్రచారం పొందవచ్చు అనే ఉద్దేశ్యంతో ఎదో ఒక కార్యక్రమం అంటే ర్యాలీలు , ధర్నాలు చేస్తూ ఉంటారూ… కానీ ఇక్కడే ప్రజలకు మంచి జరగడం ఏమో గాని , గంటల తరబడి ట్రాఫిక్ ఏర్పడి ఇది ప్రజలకు సమస్యగా మారింది.
సోమవారం రోజు ఓ లెక్చరర్ తన జన్మదిన వేడుకల సందర్భంగా చేపట్టిన ర్యాలీ , పత్తి ధర పెంచాలని చేపట్టిన అఖిలపక్ష నాయకులు చేపట్టిన ధర్నా వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది.
సోమవారం రోజు ముందే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. అలాంటిది సోమవారం రోజు అంగడి ఉన్న విషయం తెలిసి కూడా ఎందుకు ర్యాలీలు , ధర్నాలకు అధికారులు అనుమతి ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా అధికారులు , నాయకులు ప్రజల గురుంచి ఆలోచించి వారికి ఇబ్బందులు కలగకుండా తమ కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments