ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే అసెంబ్లీ తీర్మానంను వేంటనే వెనక్కి తీసుకోవాలి*
◾️అసెంబ్లీ తీర్మానంను న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటాం
◾️ఆదివాసి ఎమ్మెల్యేలు ఇందుకు సమాధానం చెప్పాలి
◾️ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 11 కులాలను అక్రమ పద్ధతిలో ఎస్టీ జాబితాలో చేర్చడం, ఇoదుకు అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయడం చారిత్రిక తప్పిదమని, ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కల్లుండి గుడ్డిగా ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరమని ఆదివాసుల తరపున సియం గారిని ప్రశ్నించ కుండా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని, ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి తీవ్రంగా మండిపడ్డారు.
శుక్రవారం నాడు ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు అధ్యక్షుతన రాష్ట్ర కమిటీ సభ్యులతో అత్యవసర జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, వ్యక్తిగత పోకడలతో 11 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం రూపంలో ప్రకటించిన పద్ధతి ఆదివాసుల యొక్క జీవితాల్లో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని అయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే జస్టిస్ చెల్లప్ప కమిషన్ పేరుతో కేవలం రేండు కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అభిప్రాయాలు సేకరించి నేడు ఏకపక్షంగా 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం ఎంత సమంజసమని ఆయన అన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలంటే వారి యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి -సాంప్రదాయాలు, జీవన విధానం, పరిణామ క్రమంలో సమిష్టితత్వం, ఆహారపు శైలి తదితరఅంశాలను పరిగణలకు తీసుకోవాల్సింది, కానీ ఏమాత్రం సమర్ధనీయం కాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీర్మానం చేయడాన్ని ఆదివాసి సేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపినారు. అలాగే శాసనసభలో ఉన్న ఆదివాసి శాసనసభ్యులు చోద్యం చూస్తూ ఈ దుర్మార్గపు చర్యలను అడ్డుకోకపోవడం వారి రాజకీయ భవిష్యత్తును వారే సమాధి చేసుకోబోతున్నాట్లు ఉన్నదని తీవ్రస్థాయిలో వారి మీద విరుచుకుపడ్డారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బోయ,వాల్మీకి, కైతీ లంబాడీలు, కిరాతులు, సుదరులు, తదితర 11 కులాలను ఎస్టి జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని వారు వాపోయారు. ఇప్పటికే యస్టి జాబితాలో అక్రమంగా చేర్చుకోబడిన కోన్ని కులాలను తోలగించాలని ఆదివాసులు ఆందోళన చేస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఎలాంటి విచారణ లేకుండా ఇంకోన్ని కులాలను చేర్చడానికి తీర్మానం చేయడం ఆదివాసుల అభివృద్దికి గోడ్డాలి పెట్టు లాంటిదని వారన్నారు. రాజ్యాంగ ఫలాలు సక్రమ పద్ధతిలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆదివాసులకు అందడం లేదని, రిజర్వేషన్లు అనేక అక్రమాలకు చోటుచేసుకుంటున్నాయని గిరిజనేతరుల వలసలు పెద్ద ఎత్తున ఏజెన్సీలో వలస బాట పట్టాయని, ఇది సరిదిద్దాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరేతినట్లుగా వ్యవహరిస్తున్నాయని మళ్లీ కొత్త కులాలను చేర్చుట ద్వారా ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. కోత్త కులాలను చేర్చే విషయంలో కనీసం ఎలాంటి విచారణ, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా తీర్మానం చేయడం చాలా విచారకరమన్నారు. భవిష్యత్తులో కలిసివచ్చే సంస్థలతో, సంఘాలతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ప్రజా ఉద్యమం ద్వారా న్యాయపోరాటం కొనసాగించడానికి సంసిద్ధం కావాలని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ మొకాశి ఆదివాసి సమాజానికి పిలుపునిచ్చారు. ఈ జూమ్ సమావేశంలో ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర నాయకులు రాయసిడం జంగు పటేల్, పెందురు విశ్వనాధ్, ఊకె రవి, పూనెం కోటి ,కోటనక గణపతి, కాత్లె బుచ్చన్న, కోరస నరేష్, పేర్ల భాస్కర్, పోలేబోయినా ఆదినారాయణ, యానక లక్ష్మీనారాయణ, కలిపి నరేష్, కొట్నాక తిరుపతి, వామన్ రావు, మంకిడి శీను, ఎలకo రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments