పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పలు ప్రజా కార్యక్రమాలు చేపట్టాలని షెడ్యూల్ విడుదల చేసిన జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం కొన్ని ప్రజా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నుండి అమరవీరుల దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.
◾️ మెగా రక్తదాన కార్యక్రమం
జిల్లా పోలీసులు మరియు ప్రజలు సహకారంతో ఈనెల 19వ తారీఖున స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం నందు భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని విజయవంతం చేయనున్నట్లు తెలిపారు.
◾️ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద సంస్మరణ దినోత్సవం
అక్టోబర్ 21న స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అమరవీరుల స్తూపం వద్ద జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు కలిసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజా ప్రతినిధులు హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అమరవీరుల కుటుంబ సభ్యులకు అత్యంత గౌరవంతో ఆహ్వానించి బహుమతుల ప్రధానం చేస్తారు.
◾️పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం
అక్టోబర్ 22న జిల్లా వ్యాప్తంగా ఉన్న 105 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, పోలీసుల విధులు, అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన పనులు, పోలీసులు చూపిన ప్రతిభ తదితర అంశాలపై విద్యార్థులకు సూచనలు, అవగాహన కల్పించడం.
◾️ షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు
జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను జిల్లాలో బహుమతి ప్రధానం చేస్తూ, రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఈ ఫోటోలను వీడియోలను అక్టోబర్ 23 తారీకు లోగా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో, ఎన్ఐబి మరియు ఐటీ కోర్ కార్యాలయాలలో అందించాలని తెలియజేశారు.
◾️ సైకిల్ ర్యాలీ…..
అమరవీరుల సంస్మరణ సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక హెడ్ క్వార్టర్స్ నందు ఈనెల 27 వ తారీఖున ఆదిలాబాద్ పట్టణంలో ప్రధాన కూడల్ల గుండా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
◾️ ప్రజల మధ్య పోలీసుల ర్యాలీలు, ప్రధాన కూడళ్ల వద్ద హోల్డింగ్స్ ఏర్పాటు
20వ తారీఖున పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పూర్తి పరిష్కారానికి కృషి చేస్తారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో జిల్లా కేంద్రం లోని ప్రధాన కోడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేస్తారు.
◾️ పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి
24న కానిస్టేబుల్ స్థాయి నుండి ఏఎస్ఐ స్థాయి వరకు వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని.
*సమర్థవంతమైన పోలీసులలో మహిళా పోలీసుల పాత్ర* అనే అంశంపై ఎస్సై మరియు ఆ పై స్థాయి అధికారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు.
ఈ వ్యాసరచన పోటీలను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో నిర్వహించాలని, 500 పదాలతో కూడిన వ్యాసరచనలో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానం మరియు రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా వీటిని పంపించి బహుమతి పొందే అర్హత లభిస్తుందని తెలియజేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments