👉20 మంది ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు శారీరక దేహదారుడ్య పరీక్షలు పూర్తి..
👉ఐదవ రోజు ప్రశాంతంగా ఏజెన్సీ అభ్యర్థులతో శారీరక దేహదారుడ్య పరీక్షల పూర్తి 👉 999 అభ్యర్థులకు గాను 700 అభ్యర్థులు హాజరు.... 👉 ఏజెన్సీ సర్టిఫికెట్ లేనివారు, పాత ఏజెన్సీ సర్టిఫికెట్ కలిగిన వారు, జీవో ప్రకారం సర్టిఫికెట్ లేని వారు 202 అభ్యర్థులకు 17వ తారీకు వరకు అవకాశం .... 👉 700 అభ్యర్థులకు గాను 374 అభ్యర్థులు అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది చివరి రాత పరీక్షకు అర్హత సాధించారు... - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
మంగళవారం ఏజెన్సీ ఏరియా కు సంబంధించిన అభ్యర్థులకు ప్రత్యేకంగా శారీరక దేహదారుడ్య పరీక్షలను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏజెన్సీ అభ్యర్థులకు ఎత్తు విషయంలో ప్రత్యేక కొలతలు ఉన్నందున ఈరోజు ఉమ్మడి జిల్లాలోని వెయ్యిమంది అభ్యర్థులను ప్రత్యేకంగా దేహదారుడ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మంగళవారం 999 అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 700 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరై 374 అభ్యర్థులు చివరి రాత పరీక్షకు అర్హత సాధించారు.

మంగళవారం రోజు 20 మంది ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా 18 మంది అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ముఖ్యంగా ఏజెన్సీ అభ్యర్థులలో ఎక్కువ మంది పాత ఏజెన్సీ సర్టిఫికెట్లను కలిగి ఉండి, కొందరు నాన్ ఏజన్సీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా అని తప్పుగా ఆన్లైన్లో ఎన్రోల్ చేసి, జీవో నెంబర్ 24 ప్రకారం ఏజెన్సీ సర్టిఫికెట్లు లేనటువంటి అభ్యర్థులు అందరూ మొత్తం 202 అభ్యర్థులకు ఈనెల 17, 19 తేదీలలో తిరిగి అవకాశాన్ని కల్పించాలని పోలీస్ నియామక మండల కి అభ్యర్థనను అందజేశారు. ఇందులో ఏజెన్సీ ఏరియాను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈనెల 17వ తారీకు వరకు ఏజెన్సీ సర్టిఫికెట్ను తీసుకొని రావాలని, జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి వారికి పోలీసు నియామక మండలి ద్వారా తిరిగి అడ్మిట్ కార్డు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు లాంగ్ జంప్ కారణంగా విఫలం చెంది వెనుతిరుగుతున్నారని, లాంగ్ జంప్ లో ఎక్కువగా శిక్షణ తీసుకొని, మెలుకువలు నేర్చుకొని పరీక్షలకు హాజరుకావాలని అభ్యర్థులకు సూచించారు. శారీరక దేహదారుడ్య పరీక్షలు నిష్పక్షపాతంగా సిసిటీవీ నిఘా లో, ఆర్ ఎఫ్ ఐ డి, రిస్ట్ బ్యాండ్ లాంటి 100% కచ్చితత్వాన్ని కలిగి ఉన్న అధినాతన పరికరాలను ఉపయోగించి నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని తాము చేసిన శిక్షణను పరీక్షలలో నిరూపించి ఎక్కువ మార్కులు సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా మైదానంలో మెడికల్ టీం చురుగ్గా ఉండి అత్యవసర సమయంలో అన్ని విధాలుగా స్పందించే విధంగా ఉంటున్నారని వారి సేవలను కొనియాడారు. దేహదారుడ్య పరీక్షల్లో జిల్లాకు చెందిన 10 మంది పీఈటీ లు పాల్గొంటున్నారని, వారి పాత్ర కీలకమని ఉదయం నాలుగు గంటల నుండి మైదానంలో హాజరై వారి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారని వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ పరీక్షల నిర్వహణలో పాల్గొన్న అధికారులు అడిషనల్ ఎస్పీ సి సమైజాన్ రావు, డీఎస్పీలు వి ఉమేందర్, ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, ఎస్ ఉపేందర్, సిహెచ్ నగేందర్, జీవన్ రెడ్డి, పోలీసు కార్యాలయం ఏవో యూనుస్ అలీ, సూపర్డెంట్లు జోసెఫిన్, ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, జిల్లా సిఐలు, ఆర్ఐ లు, ఎస్ఐలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఐటీ కోర్,ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టి ఉమ్మడి జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments