Wednesday, October 15, 2025

నిషేధిత పారిస్ సిగరెట్లు స్వాధీనం… ముగ్గురి పై కేసు

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది గుట్కా వ్యాపారులు డబ్బుకోసం సంపాదన కోసం  అడ్డదారులు తొక్కుతున్నారు. నిషేధిత సిగరెట్లు , కల్తీ గుట్కా ప్యాకెట్లు అమ్ముతూ అమాయక ప్రజల ప్రాణానికి ముప్పు తీసుకొస్తున్నరు. తాజాగా ఇచ్చోడ మండల కేంద్రం లో ముగ్గురు వ్యక్తులు నిషేధిత పారిస్ సిగరెట్లు అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. నిషేధిత సిగరేట్లు అమ్ముతున్న ముగ్గురి పై కేసులు నమోదు అయ్యాయి. ఇచ్చోడ కు చెందిన నూర్ ఖన్, అబ్రార్, అస్లాం ల పై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. ఈ నిషేధిత సిగరెట్ల వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోయి కాన్సర్ వంటి హానికారక రోగాల బారిన పడి  మనిషి తన ఆయుష్షు ను సగం కోల్పోతాడు. అయితే గతంలో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా  బ్లాక్ మార్కెట్ సిగరేట్ల భారీ రాకెట్ ను పోలీసులు భగ్నం చేశారు. అయితే 2019 లో  బంగ్లాదేశ్ నుండి కలకత్తా మీదుగా హైదరాబాద్ కు  ఈ నిషేధిత పారిస్ సిగరెట్ తరలిస్తున్న ముఠా రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఈ సిగరెట్ వల్ల మనిషి కాన్సర్ బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

విదేశీ సిగరెట్లను అక్రమంగా రవాణా చేయడం బ్లాక్ మార్కెటర్లకు తరలించడం లాభదాయకమైన వ్యాపారం, అక్రమార్కులు కస్టమ్స్ డ్యూటీని తప్పించుకోవడం వల్ల భారీ లాభం పొందుతున్నారు.  సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003లోని సెక్షన్.20(2)లోని నిబంధనల ప్రకారం స్మగ్లింగ్ సిగరెట్లపై చిత్ర హెచ్చరికలు ఉండవు. సిగరెట్‌లకు ప్యాకెట్‌లపై తయారీ చిరునామా ఉండదు మరియు బిల్లులు ఉండవు. వీటిని  సేకరించడం లేదా దిగుమతి చేసుకోవడం వల్ల సిగరెట్ల స్మగ్లింగ్‌లో మార్జిన్ దాదాపు 100 శాతం ఉంటుంది” అని గతంలో హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!