రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ : బెల్టు షాపులు వల్ల విసుగుచెందిన ఆ కాలనీ వాసులు మంగళవారం పోలీసులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. బోథ్ పట్టణంలో ని పోచమ్మ గల్లీ లో బెల్టుషాపుల వల స్థానికులు మద్యానికి బానిసై నిత్యం కుటుంభం లో కలహాలు జరుగుతున్నయని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పోలీసులు ను అక్కడి నుండి బెల్టుషాపులను శాశ్వతంగా తీసివేయలని కోరుతూ బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు మరియు బోథ్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
Thank you for reading this post, don't forget to subscribe!బెల్టుషాపుల వల్ల మద్యానికి బానిసలుగా మారి కుటుంబాలను సైతం మార్చి పోతున్నారని 24 గంటలు మద్యం సేవించడం వల్ల కుటుంబంలో గొడవలకు దారి తీస్తున్నదని , ఆరోగ్యం సైతం చెడిపోతున్న పట్టించుకోక ఎప్పుడు బెల్టుషాపుల వద్దనే ఉంటు కుటుంబాలను గాలికివదిలిపెడ్తున్నారని కాలనీ వాసులు పేర్కొన్నారు. కాలనిలో బెల్ట్ షాపులు శాశ్వతంగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు , పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్ , బోథ్ పట్టణ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కట్ట భూమేష్ , వార్డు సభ్యులు వినయ్ , రావుల శంకర్ , తల్లా శంకర్ , పాలిక్ రమేష్ , సాయి, మెరుగు బాబు తదితరులు ఉన్నారు.
Recent Comments