వ్యాక్సిన్ తీసుకోకున్న విజయవంతం గా సెకెండ్ డోస్ పూర్తి చేసుకున్నట్లు నమోదు…
ఇచ్చోడ పిహెచ్ సి వైద్యుల నిర్వాహకం…
లక్ష్యం కోసం తప్పుడు నివేదికలు ఇస్తున్నా వైద్యధికారులు..
అవార్డు కోసమైతే కాదు కదా…..!?
ఇచ్చోడ : కరోనా వ్యాక్సిన్ టార్గెట్ రీచ్ కావడం కోసం స్థానిక వైద్యధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ సెకెండ్ డోస్ తీసుకోకున్న, తీసుకున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తాజా ఇచ్చోడ మండలం లోని ఓ గ్రామం లో దంపతులు మొదటి డోస్ తీసుకుని, రెండవ డోస్ కోసం వేచి చూస్తున్నారు. డోస్ తీసుకోవడానికి ముందు జ్వరం రావడంతో సమయానికి తీసుకోలేదు. కానీ వారికి మీరు విజయవంతం గా రెండవ డోస్ పూర్తి చేసుకున్నట్లు, కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ రావడం తో అవక్కాయ్యారు. దీన్ని బట్టి చూస్తే టార్గెట్ ను చేరుకోవడానికి క్షేత్రస్థాయిలో పని చేసే వైద్యులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అయితే పంపడం లేదు కదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.


Recent Comments