— రూ.2 లక్షలనగదు, ఆఫీస్ కంప్యూటర్లు, రసీదు బుక్కులు స్వాధీనం….
— వివరాలు వెల్లడించిన సిఐ కె శ్రీధర్…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : లక్కీ చిట్టీల పేరుతొ ప్రజలను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రెండవ పట్టణ సిఐ కె శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణ సిఐ కె శ్రీధర్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చెశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో జై భవానీ మోటార్ స్కీం పేరుతో లక్కీ చిట్టి నడుపుతూ ప్రజలను మోసం చేసిన నిందితుడు కాంబోజీవార్ ప్రమోద్ కుమార్ (41) ను ఉదయం 8 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు వివరాలను తెలుపుతూ నిందితుడు 2010 సంవత్సరం నుండి ఈ లక్కీ చిట్టి లను నడుపుతున్నాడని అందులో లో భాగంగా చిట్టి గ్రూపులు A,B,C,D,E లను సక్రమంగా నడిపి 2018 సంవత్సరం నుండి నడిపిన లక్కీ గ్రూపు అయినా F,G లలో సభ్యులలో 95 మందికి మోసం చేసి వారి వద్ద నుండి దాదాపు 33 లక్షల రూపాయలు వసూలు చేసి వారికి తిరిగి ఇవ్వలేదని తెలిపారు.
నిందితుని వద్ద నుండి రూ.2 లక్షల నగదు,లక్కీ చిట్టి కి సంబంధించిన రసీదు బుక్కులు, ఆఫీసు కంప్యూటర్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుని పై ఫిబ్రవరి నెలలో ఒకటి, మార్చి నెలలో రెండు కేసులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ లక్కీ చిట్టి పేరుతో ప్రజలను మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని ఎవరైనా మీ వద్దకు వచ్చి లక్కీ చిట్టి నిర్వహిస్తామని చెప్పి మోసగించే ప్రయత్నం చేస్తారని వారి మాటలకు మోసపోవద్దని సూచించారు. అలాంటి మోసగాళ్ల పై సంబంధిత దగ్గరలో గల పోలీస్ స్టేషన్ లో ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
నిందితుని అరెస్టు కు ఎంతగానో కృషి చేసిన ఎస్ఐ విష్ణు ప్రకాష్, సిబ్బంది ఎం ఏ కరీం, ఠాకూర్ జగన్ సింగ్ లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సమావేశంలో రెండవ పట్టణ ఎస్ఐ లు విష్ణువర్ధన్, విష్ణు ప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments