*దాదాపు రూ 40 వేల విలువగల ప్రభుత్వ రాయితీ బియ్యం, తరలిస్తున్న వాహనం స్వాధీనం.*
*4 గురి పై కేసు నమోదు.*
*అక్రమ సరుకు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.*
ఉట్నూర్: బుధవారం రాత్రి ఉట్నూర్ మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 20 క్వింటల్లా ప్రభుత్వ రాయితీ బియ్యం లభ్యమైందని ఉట్నూరు ఎ ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. అక్రమంగా సరుకు రవాణా చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న దళారుల పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడిందని తెలిపారు. కేసు నమోదు అయిన వారి వివరాలు
1) నల్లన్న కిష్టయ్య s/o బుచ్చన్న, ఉట్నూర్, రేషన్ షాప్ డీలర్.
2) ఠాకూర్ అరుణ్ సింగ్ s/o ధారా సింగ్, ఉట్నూర్, వాహన డ్రైవర్.
3) ఠాకూర్ ధారా సింగ్ s/o శంభు సింగ్, ఉట్నూర్,
4) గ్యాన్ సింగ్
ప్రభుత్వ రాయితీ బియ్యం తక్కువ ధరకే కొని ఎక్కువ ధరలకు అమ్ముతున్న దళారి.
ఈ ముగ్గురిపై కేసు నమోదు అయిందని తరలిస్తున్న వాహనం (AP 01 T 4257) స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అక్రమ వ్యాపారం ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద నుండి కొనుగోలు చేస్తూ ఎక్కువ ధరలకు అమ్ముతున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఏ ఎస్ పి హెచ్చరించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments