Saturday, August 2, 2025

రౌడీయిజానికి పాల్పడుతున్న వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు



* నిందితుడు షేక్ సలీం @  కైంచి సలీం (బంగారిగూడ) అరెస్టు, చంచలగూడ జైలుకు తరలింపు

* షేక్ సలీం @ కైంచి సలీం పై హత్య, రౌడీయిజం, కిడ్నాప్, బెదిరింపుల కేసులలో ప్రధాన నిందితుడు

* ఆదిలాబాద్ వన్ టౌన్, రూరల్, మావల పోలీస్ స్టేషన్లో ఇతనిపై 8 కేసులు నమోదు

* పదేపదే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఏర్పాటు, పిడి యాక్ట్ నమోదు

* గంజాయి తరలిస్తూ, వ్యాపారం చేస్తూ ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

– ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: రౌడీయిజం చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, మారనాయుధాలతో పబ్లిక్ స్థలాలలో విన్యాసాలు చేస్తూ, తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న *షేక్ సలీం (30) @ కైంచి సలీం* పై *పిడి యాక్ట్* నమోదు చేసి అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించడం జరిగిందని ఆదిలాబాద్ *డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి* తెలియ చేశారు. నిందితునిపై ఇదివరకే ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో పోలీస్ స్టేషన్లో 8 కేసులలో ప్రధాన నిందితుడుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

ముఖ్యంగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో హత్య కేసు, రూరల్ పోలీస్ స్టేషన్ నందు(6 కేసులు) మారణాయుధాలతో విన్యాసాలు చేస్తు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్న కేసు, ఆటో డ్రైవర్ ని కిడ్నాప్ చేసి రూమ్ లో బందించి బాధితుని బట్టలు విప్పదీసి, మూకుమ్మడిగా దాడి చేసి  వీడియోలు తీసి విచక్షణారహితంగా కొట్టిన సందర్భంలో పలు కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వేధించిన సందర్భాలలో ఇతనిపై కేసు నమోదు అవ్వడం జరిగిందన్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తప్పు చేసిన వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలతో  పీడీ యాక్ట్ సైతం నమోదు చేయడానికి వెనకాడ బోధని తెలిపారు.

అదేవిధంగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై, రౌడీయిజం చేసే వారిపై గంజాయి స్మగ్లర్లు, అమ్మేవారిపై తగు చర్యలను తీసుకుంటుందని తెలిపారు. నిందితుడు షేక్ సలీం @ కైంచి సలీం 2019 సంవత్సరంలో హత్య కేసు 2025 సంవత్సరం రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆమ్స్ యాక్ట్ కేసులు, రౌడీయిజం కేసు నమోదు అయినాయని తెలిపారు.

ప్రవర్తన మార్చుకొని రౌడీలు, వ్యవస్థీకృత నేరాలు చేసే వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసి పరిశీలించడం జరుగుతుందని అదేవిధంగా నేరాలకు పాల్పడుతున్న వారిపై పిడి యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

ఈ అరెస్టు లో ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్,రూరల్ ఎస్ఐ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి