📰 రూ 56,360/- నగదు, సెల్ ఫోన్ స్వాధీనం….
Thank you for reading this post, don't forget to subscribe!📰 వివరాలు వెల్లడించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం సేకరించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి మరియు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ ఎస్ఐ చాకచక్యంగా దాడి చేసి నిందితుడు ఎండి ఫిరోజ్(38) ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మట్కా నిర్వాహకున్ని అరెస్టు చేసిన సిసిఎస్ సిబ్బందిని వన్ టౌన్ ఎస్ఐ ని జిల్లా ఎస్ పి డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నిందితుని వద్దనుండి రూ 56,360/- నగదు, మరియు ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఒకటి ఒకట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేరస్తుడు కూలీల వద్ద, డ్రైవర్ల వద్ద మట్కా ఆశ చూపి, మట్కా నిర్వహిస్తున్నారని వచ్చిన మట్కా డబ్బులను మహారాష్ట్రలోని మోహిత్ జైన్, గొలు రాయ్ అనే వ్యక్తులకు డబ్బులు పంపిస్తాడని విచారణలో తెలిపాడు. ఈ ఆపరేషన్లు సిసిఎస్ ఎస్ఐ టి రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments