- ఇద్దరికి తీవ్రగాయలు…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఆదిలాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు ఇచ్చోడ మండల కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో బైక్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడపటం వల్ల నాగ్నూర్ వార్ విక్రమ్ (23) అనే యువకుడికి తీవ్రగాయలై సంఘటన స్థలం లోనే మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ కు చెందిన నాగ్నూర్ విక్రమ్, రామేల్లి సాయి, పార్థ సాయి తేజ అనే ముగ్గురు స్నేహితులు పల్సర్ బైక్ పై పని నిమ్మిత్తం ఉదయం ఇచ్చోడా మండల కేంద్రానికి వచ్చారు. పనులు ముగించుకుని ఆదిలాబాద్ వైపు తిరుగు ప్రయాణంలో నాగ్నూర్ వార్ విక్రమ్ బైక్ ను నడుపుతుండగా రామేల్లి సాయి మరియు పార్థ సాయి తేజలు వెనుక కూసున్నారు. ఇచ్చోడ లోని చర్చి వద్దకు రాగానే బైక్ వేగం మీతిమిరడం తో అదుపు తప్పి డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో నాగ్నూర్ వార్ విక్రమ్(23) కు తీవ్రగాయాలయి అధిక రక్తస్రావం కావడం తో అక్కడిక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమం గా ఉండడంతో మెరుగైన చికిత్స నిమ్మిత్తం 108 అంబులెన్సు లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి స్థానిక మిత్రునికి ప్రమాద బాధితులు ఫోన్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments