ePaper
Wednesday, March 11, 2026
📄 ePaper

Crime : ఇచ్చోడలో ఐబి వద్ద మట్కా నిర్వాకుని అరెస్ట్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

మట్కా స్థావరాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ దాడులు …..

నిందితుడి వద్ద నుండి మట్కా చిట్టీలు, రూ 12860/- స్వాధీనం

ఇచ్చోడ లో గుట్టచప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ సిఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో బుధవారం రోజు దాడిచేసి పట్టుకున్నారు.

టాస్క్ ఫోర్స్ సిఐ ఈ చంద్రమౌళి చెప్పిన వివరాల ప్రకారం జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు పలుచోట్ల విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఇచ్చోడ లో ఐబీ చౌరస్తా నందు మట్కా నిర్వహిస్తున్న ఇచ్చోడ పట్టణంలో సుభాష్ నగర్ కు చెందిన గంగా సాగర్ బాలాజీ (50) అరెస్టు చేసి ఆయన వద్ద నుండి మట్కా చిట్టీలు మరియు రూపాయలు 12,860 వేల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నేరస్తుడిని తదుపరి విచారణ కొరకు ఇచ్చోడ ఎస్ఐ ఉదయ్ కుమార్ కు అప్పగించడం జరిగింది అని తెలిపారు. మట్కా స్థావరాలపై దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రమేష్, సిబ్బంది దారట్ల శోభన్, ఎం ఏ కరీం, ఠాకూర్ జగన్ సింగ్, హనుమంతరావు, మంగల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!