🔶 ఘనంగా హోలీ సంబురాలు జరుపుకున్న జిల్లా పోలీసులు….
Thank you for reading this post, don't forget to subscribe!🔶 సురక్షితమైన రంగులతో తగు జాగ్రత్తలు తీసుకొని హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచన….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు, పరేడ్ మైదానం నుండి సాయుధ పోలీసులు బ్యాండ్ మేళాలతో ఎస్పి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని వేడుకలు జరుపుకున్నారు, అనంతరం ఎస్పీ తో కలిసి ఆనందోత్సవాల నృత్యాలు చేస్తూ సందడి చేశారు.





అనంతరం జిల్లా పోలీసులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు అందించారు. తదుపరి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుటుంబ సమేతంగా వచ్చి వారికి వారి కుటుంబానికి హోలీ శుభాకాంక్షలు తెలియ జేసీ మిఠాయిలు అందిపుచ్చుకున్నారు. ఈ సంబరాల్లో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస రావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐలు పి సురేందర్, ఆర్ ఐ లు డి వెంకటి, జి వేణు, శ్రీ పాల్, వంశీకృష్ణ,సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments