▪️ఖాళీ సమయాలలో పోలీస్ మ్యానువల్ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి ▪️బదిలీపై వెళ్తున్న పోలీస్ కార్యాలయ సెక్షన్ సూపరిండెంట్ ఎంఎ జోసెఫిన్ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ లో పోలీస్ ముఖ్య కార్యాలయం నందు సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి బదిలీపై రెండవ బెటాలియన్ కు వెళ్తున్న పోలీస్ కార్యాలయం ఏ సూపర్డెంట్ ఎం ఎ జోసెఫిన్ వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శాలువా తో సత్కరించి జ్ఞాపికను అందజేసి వేడుకోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1987 సంవత్సరంలో ఉద్యోగంలోకి స్టెనోగ్రాఫర్ గా అడుగుపెట్టిన కార్యాలయం సెక్షన్ సూపర్డెంట్ గా అంచలంచలుగా ఎదిగిన అధికారిని ఎం ఎ జోసెఫిన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యాలయంలో చురుకుగా విధులు నిర్వర్తించి జిల్లా ఎస్పీ గారికి ఎటువంటి రిమార్కులు రాకుండా తన సర్వీసు 36 సంవత్సరముల పాటు నిర్విరామంగా, విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు బదిలీపై ఆదిలాబాద్ రెండవ బెటాలియన్ కు వెళ్లనున్నారని తెలిపారు. ఒకే కార్యాలయం నందు స్టెనోగ్రాఫర్ గా అడుగుపెట్టి కార్యాలయ సెక్షన్ సూపర్డెంట్ గా ఎదగడం మరియు ఎటువంటి రిమార్కులు లేకుండా బదిలీపై వెళ్లడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న హెచ్ఆర్ఎంఎస్ లాంటి అధునాతన విధానాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా తెలుసుకొని ఎటువంటి అలసత్వం లేకుండా సకాలంలో తమకు సంబంధించిన విధులను నిర్వర్తిస్తూ రాష్ట్రంలో ఆదిలాబాద్ కార్యాలయానికి మంచి పేరును తీసుకురావాలని తెలిపారు. తమకు కేటాయించిన సెక్షన్లలకు సంబంధించిన విషయాలపై జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టతరమో దానిని నిలబెట్టుకోవడం, సక్రమంగా నిర్వర్తించడం అంతే కష్టమని తెలిపారు.
ఖాళీ సమయాలలో పోలీస్ మాన్యువల్ కు సంబంధించిన పుస్తకాలను చదవాలని వాటిలో నూతనంగా వచ్చిన ఉద్యోగ సంబంధిత విషయాలను తెలుసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ బి రాములు నాయక్, పోలీస్ ముఖ్య కార్యాలయం ఏఓ యూనిస్ అలీ, సూపర్ ఇండెంట్లు సులోచన, గంగాధర్, సంజీవ్, సెక్షన్ అధికారులు ఆశన్న,పోతరాజు,మురళి, కొండరాజు , దయానంద్, భారతి, కర్ణ శ్రీ, మంజూరులాఖాన్, స్రవంతి, లక్ష్మి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments