తెలంగాణ లో జర్నలిస్టుల కు రక్షణ కరువు…!?
ఆర్మూర్ ఎమ్మెల్యే,అతని అనుచరులను అరెస్టు చెయ్యాలని- తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిమాండ్…..
◾నిజామాబాద్ నుండి మాక్లూర్ వరకు బైక్ ర్యాలీ…
◾రెండున్నర గంటల పాటు మాక్లూర్ రహదారి దిగ్భంధం భారీగా నిలిచిపోయిన వాహానాలు….
◾తహసిల్దార్ ఆఫీస్,పోలీస్ స్టేషన్ ల ముట్టడి-సీఐ,ఎస్సై నిలదీత.
◾ఆందోళనతో విచారణకు కదిలిన మాక్లూర్ పోలీసులు …
రిపబ్లిక్ హిందుస్థాన్, నిజాంబాద్ : తెలంగాణలో వాస్తవాలను వెలికి తీసే విలేకర్ల పైన దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివరాల్లోకి వెళితే..సాక్షి దినపత్రిక మాక్లూర్ మండల విలేకరి కమలాపురం పోశెట్టి పై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అతని అనుచరులైన రాజకీయ గూండాలు దాడి చేసిన సంఘటనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సోమవారం తలపెట్టిన చలో మాక్లూర్ కార్యక్రమంవిజయవంతమైంది.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుండి భారీ సంఖ్యలో ప్రారంభమైన బైక్ ర్యాలీ కంటేశ్వర్ మీదుగా దాస్ నగర్ గుండా మాక్లూర్ వరకు చేరుకుంది.మాక్లూర్ మండలా ఫీసుల ఎదుట గల రహదారిపై జర్నలిస్టులు,పలు రాజకీయ,వామపక్ష పార్టీ లు,ప్రజా సంఘాల నేతలు భైఠాయించి రెండున్నర గంటల పాటు రాస్తారోకో,ధర్నా నిర్వహించారు.అనంతరం మాక్లూర్ తహసిల్దార్ ఆఫీస్ తో పాటు మాక్లూర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిరసన తెలిపారు.పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఐ,ఎస్సై లను నిలదీశారు.
ఇది వరకే నేర చరిత్ర గల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యా రాజకీయాలకు ఒడిగడుతున్నారని ఇందులో భాగంగానే సాక్షి రిపోర్టర్ పొశెట్టిపై తన అనుచరులతో కలిసి హత్యా యత్నానికి పాల్పఢ్ఢారని హాజరైన వక్తలు ముక్తకంఠంతో ఆరోపించారు.

ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై హత్యా నేరం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజెయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొబ్బిలి నరసయ్య,అంగిరేకుల సాయిలు,సాక్షి ఎడిషన్ ఇంచార్జీ ప్రభాకర్,బ్యూరో ఇంచార్జి భద్రా రెడ్డి,సాక్షి టివీ స్టాఫ్ రిపోర్టర్ రమణలతో పాటు బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య,ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, సిపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూరు డివిజన్ నాయకులు వి.ప్రభాకర్,గంగాధర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు,జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, సిపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య,రాజన్న, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మెహతీ రమేశ్,సంజీవ్, డిఎల్.ఎఫ్ రాష్ట్ర నాయకులు దండి వెంకటి,జిల్లా నాయక్ పోడ్ సంఘం అధ్యక్షులు అంజయ్య, ఐద్వా నాయకురాలు నుర్జాహాన్,సబ్బని లత,టియుడబ్ల్యూజే 143 జిల్లా నాయకులు నరసింహ చారి,ప్రొగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హరికృష్ణ,నిజామాభాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి రాజలింగం,టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు ప్రసాద్,దేవిదాస్,గోవింద్ రాజు,పొన్నాల చంద్ర శేఖర్,అజీమ్, ప్రమోద్,జావిద్ పాషా,మహేందర్,మల్లెపూల నర్సయ్య,ఆంజనేయులు,కిషన్,మోహన్ గంగాదాస్,రజనీ కాంత్,నవీన్,మాక్లూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మినారాయణ, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టి మురళి,బోధన్ ప్రెస్ క్లబ్ నాయకులు గంగులు,గంగాధర్, ఎడపల్లి ప్రెస్ క్లబ్ నాగరాజూ,సునీల్,డిచ్ పల్లి ప్రెస్ క్లబ్ అఫ్సర్,మధు,మురళి తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments