రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ :
సిరికొండ మండల కేంద్రానికి చెందిన మన తెలంగాణ దినపత్రిక విలేకరి గుగ్గిళ్ళ స్వామి పూజిత ఇంటికి వచ్చి నూతన పెళ్లి వధూవరుల జంటను తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి అధ్యక్షులు డాక్టర్ సామ్రాట్ అశోక్ ముస్తాపురే మంగళవారం రోజు నూతన వధూవరులను శాలువతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లి శుభ సందర్భంగా నేను పెళ్ళికి హాజకాలేకపోయానని ఈరోజు సమయం దొరకడం వల్ల పెళ్లి వధూవరుల ఇంటికి వచ్చి వారిని సోదర భావంగా ఆశీర్వదించడం జరిగిందని తెలిపారు.
అనంతరం నూతన వధూవరులు తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ ముస్తాపురే ను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సిరికొండ సర్పంచ్ నర్మదా పెంటన్న, ఉపసర్పంచ్ చిన్న రాజన్న, పొన్న గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ డాక్టర్ పాంచాల్ మారుతి, లక్ష్మన్న రాజు, అమూల్ ఉన్నారు.
Recent Comments