రిపబ్లిక్ హిందుస్థాన్, మేడారం (జనవరి 15) : భారత స్వతంత్రవనిలో 75 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన అనేక రాజకీయ పార్టీలు ఆదివాసులు మోసం చేస్తూ వస్తున్నాయని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఓట్లు వేపిచ్చుకుంటున్నారని ఆదివాసుల హక్కులు చట్టాలు, ఆర్థిక అంశాల వారి అభివృద్ధి గురించి పేరుకే బడ్జెట్లో కేటాయిస్తున్నారు తప్ప , వాటి అమలుకు ఏమాత్రం చిత్తశుద్ధిగా కృషిచేయట్లేదని, ఓటు ద్వారా వారికి బుద్ధి చెబుతామని ఇoదుకు నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు ద్వారా పరిష్కరిస్తామని ఆదివాసి నాయకులు గుండు శరత్, వెంకట్ సోడేo, ఎంవీ రావు మడకo తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఆదివాసీ నాయకుల సమావేశం ములుగు జిల్లా మేడారంలో ఆదివాసీ నేత కొమరం కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆదివాసి సమస్యలైన జల్, జంగల్, జమీన్ కోసం సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కేవలం ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వరకు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆదివాసులను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాల్లో వనరుల దోపిడీ జరుగుతుందని, ఓపెన్ కాస్ట్ ఏర్పాటు ద్వారా గిరిజనులకు కల్పించిన ఉపాధి ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల స్థాపన పేరుతో గిరిజనులనూ నిర్వాసితులను చేస్తూ, ఆర్ఆర్ ప్యాకేజీలను గిరిజనేతరులకు కట్టబెడుతున్నారు. ఐటిడిఏ కేంద్రాలు రాజకీయ లబ్ధి కేంద్రాలుగా మారాయని అక్కడ ఆదివాసులకు న్యాయం జరగట్లేదు అని విమర్శించారు. లక్షలాది కోట్లాది రూపాయల నిధులు బడ్జెట్లో చూపించి గిరిజన ఆవాస గ్రామాలకు మొండి చేయి చూపిస్తున్నాయని అన్నారు. ఏజెన్సీలో రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులు కొద్దిమంది గిరిజనేతర పార్టీలో వారి మోచేతి నీళ్లు తాగే వారికి పునరావాస కేంద్రాలుగా ఉన్నాయి అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు గిరిజనేతరులకు ఊడిగం చేస్తున్నారని, కాబట్టి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని ఈ సందర్భంగా గుర్తించారు. కావున సువిశాలమైన ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు ఐక్యం కావలసిన అవసరం ఉందని గుర్తించారు. గిరిజన చట్టాల రక్షణ, అమలు గిరిజన హక్కుల సాధన కోసం నూతన రాజకీయ పార్టీ ఏకైక మార్గమని వారు తెలిపారు. పార్టీలో అన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యం అనగా యువత, మహిళలు, కార్మిక, పేద రైతాంగ, విద్యార్థి సాధారణ ప్రజల ఆశల కు అనుగుణంగా పార్టీ ఉండబోతున్నట్లుగా వారు తెలిపారు. త్వరలో పార్టీ యొక్క పేరు, జెండా,ఎజెండా ఖరారు చేయనున్నట్లు తద్వారా భారీ సభ ద్వారా ప్రకటిస్తామని వారు వివరించారు. పార్టీకి సంబంధించి అదిలాబాదు నుండి శ్రీకాకుళం వరకు, నాగపూర్ నుండి భువనేశ్వర్ వరకు విస్తృతమైనటువంటి గిరిజన భూభాగంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు రూపకల్పనకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మేధావులతో, ఆదివాసి సమాజ శ్రేయోభిలాషులతో, ఆదివాసి ప్రజా సంఘాలతో ఇప్పటికే అనుభవం ఉన్న ఆదివాసి సమాజం నాయకులు, ప్రజా ప్రతినిధులు నూతన పార్టీలో భాగస్వామ్యం కానున్నట్లు వారు వివరించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన చేశారు.
ఈ సమావేశంలో బల్దేవ్ మడవి ( ఛత్తీస్ ఘడ్), వికాస్ కుడిమిత ( మహారాష్ట్ర) నరేష్ కొరస, వజ్జ జ్యోతి బస్, విశ్వనాథ్ పెందోర్, ( తెలంగాణ), చుంచు రాజు, మడక దుర్గారావు, కుంజా ప్రసాద్ ( ఆంధ్రప్రదేశ్ )తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments