ఎక్కడ ఆపద వస్తే అక్కడ నేనున్నానంటూ..
ఆపదలో ఉన్న ప్రజలను పరామర్శిస్తూ… ఆర్థిక సహాయం అందజేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న బీజేపీ పార్టీ యువనాయకుడు రాణా ప్రతాపరెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, నర్సంపేట : గత ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూరి గుడిసెలలో ఉన్నవారు ఇండ్లు కోల్పోయి, అలాగే వరద నీరు వల్ల కొన్ని గ్రామాలు వరదలో మునిగిపోయి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతున్నా వేళ…. ఓ యువనాయకుడు ప్రజలకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందిస్తున్నాడు నర్సంపేట బీజేపీ పార్టీ యువనాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి.
నేనున్నానంటూ భరోసా..
ఎక్కడ కష్టం వస్తే అక్కడ నేనున్నానంటూ భరోసానిస్తూ… వర్షంను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గంలోని గ్రామాలలో పర్యటిస్తూ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. రోజుకో గ్రామానికి వెళ్ళుతూ ఆపదలో ఉన్న వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఏ నాయకుడు చేయని విధంగా ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజల నాయకుడిగా రాణా ప్రతాప్ రెడ్డి గుర్తింపు పొందుతున్నాడు.
నల్లబెల్లి మండలంలో
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లబెల్లి మండలం నార్కపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుని ఇల్లు పూర్తిగా కూలిపోయింది. విషయం తెలుసుకున్న రానా ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటికి సరిపడా తాడిపత్రిని అందజేసి నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందజేశారు.
మేడపల్లి గ్రామంలో
రోజు కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని మేడపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ ఇల్లు కూలిపోయింది. పలువురు గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఇంటికి సరిపడా పరదాను అందించి నేనున్నానంటూ భరోసాని కల్పిస్తున్నాడు.
చెన్నారావుపేట మండలంలో
చెన్నారావుపేట మండల కేంద్రంలో గత అయిదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్శ రవీందర్ ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకొను వారి ఇంటికి వెళ్లి ఇల్లు ని సందర్శించి ఆర్ధిక సాయం అందజేశారు…
పేద నిరాశ్రయ కుటుంబానికి అండగా
చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ బైక్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడుము మరియు కాళ్లు పనిచేయకుండా మంచానికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి నేనున్నాననీ భరోసా కల్పించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో ఇండ్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments