రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి: తెలంగాణ ప్రభుత్వం జరిపిన బీసీ కుల గణన సర్వేలో తేలిన 56.75 శాతం ప్రకారమే త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలనీ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. నల్లబెల్లి సుమంగళి ఫంక్షన్ హాలులో ఓదెల రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలని చాలా మంది బీసీ నేతలు, సంఘాలు అంటున్నాయనీ కానీ బీసీ కులగుణన చేసిన తర్వాత అధికార యంత్రాంగం సర్వే నివేదిక మంత్రి వర్గం ఉపసంఘానికి నిన్న ఇచ్చిన తర్వాత అందులో 56.75 శాతం లెక్క తేలినట్టు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన తర్వాత కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలనీ డిమాండ్ చేయడం సహేతుకమైనది కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు, రాష్ట్ర విద్యా, ఉపాధి రంగాల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 56.75 రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.అంతే కాకుండా ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ లు, మున్సిపల్ కౌన్సిలర్, కార్పోరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్ పదవులకు కూడా ఈ దామాషా ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలనన్నారు.అంతేకాకుండా దేశవ్యాప్తంగా బీసీ కుల గణన ప్రకారం సకల రంగాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వెంటనే కుల జనగణన చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వులను ఇప్పించాలనీ, తద్వారా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి బిల్లు ఆమోదింప చేయాలనీ ఈనెల 7 నుంచి జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చీకటి ప్రకాష్,మండల కో కన్వీనర్ మేడిపల్లి రాజు గౌడ్,మండల కమిటీ సభ్యులు కోల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments