Friday, February 7, 2025

కోడల్ని హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష

🔴 వివాహేతర సంబంధం బయటకు వస్తుందని కోడల్ని హత్య చేసిన అత్తకు మరియు ఆమె రంకు మొగునికి జీవిత ఖైదు శిక్ష విధించిన జిల్లా జడ్జి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : వివాహేతర సంబంధం బయటకు వస్తుందని కోడల్ని హత్య చేసిన అత్తకు మరియు ఆమె రంకు మొగుడికి జీవిత ఖైదు శిక్షపడింది.

కేసు పూర్వపరాలకు వెళ్తే………
A1 నేరస్తురాలు జాదవ్ కాశీ భాయ్ ఆమె కొడుకు
A3 నిందితుడు జాదవ్ సుదాం, బాధితురాలు జాదవ్ మమత@వందనా భాయ్ తో 02/05/2010 నాడు వివాహం జరిగినది. వివాహములో నేరస్తుల కోరిక మేరకు వరకట్నం 2 లక్షల రూపాయలు, రెండు తులాల బంగారం మరియు ఇతర ఇంటి సామాగ్రి ఇచ్చినారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెండ్లి అయిన కొన్ని రోజుల దాకా వీరి సంసారం బాగానే సాగినది. తర్వాత అదనపు వరకట్నం కోసం వారు జాదవ్ మమత@ వందనా బాయిని వేదించ సాగారు. ఇట్టి విషయంలో పంచాయతీలు కూడా జరిగాయి. పంచుల సమక్షంలో  నేరస్తులు ఆమెను మంచిగా చూసుకుంటామని తెలిపినారు. నార్నూర్ పోలీసు వారు వారికి కౌన్సిలింగ్ కూడా చేసినారు. అప్పటినుండి అత్త, కోడలు వేరువేరుగా ఉండేవారు.

ఇది ఇలా ఉండగా జాదవ్ కాశీ భాయ్ (A1) కి ఆడే మాణిక్ రావు(A2) తో అక్రమ సంబంధం ఏర్పడినది. ఆయన తరచూ జాదవ్ కాశీ భాయి వద్దకు వస్తూ పోయేవాడు. ఇది గమనించిన ఆమె కోడలు శ్రీమతి జాదవ్ మమత @ వందనా బాయి తన అత్త కాశి బాయ్ ని విచారించినది, ఇలా మళ్లీ ఆమెకు కనిపిస్తే తన కొడుకుకు మరియు గ్రామస్తులకు తెలుపుతానని గట్టిగా చెప్పి తన అక్రమ సంబంధాన్ని మానుకోవాలని చెప్పినది. దీంతో తన బండారం బయటపడి తన పరువు పోతుందని భావించిన కాశీ భాయి తన రంకుల మొగుడు అయిన అడే మాణిక్ రావు (A2) తో మాట్లాడి తన కోడలును చంపాలని ఉద్దేశంతో ఆయనకు రూ.20,000 ల నగదు ఇప్పిస్తానని ఒప్పుకొని రూ.10,000 లు నగదు ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చినది.

తేదీ 21-09-2017 తన కొడుకు జాదవ్ సుదాం (A3) హైదరాబాద్ వెళ్లడంతో దానిని అదునుగా భావించి అదే రోజు రాత్రి  2:30 గంటలకు అనగా తేదీ 22/09/2017 నాడు మధ్య రాత్రి తరువాత ప్రాంతంలో నేరస్థుడు అడే మాణిక్ రావు వచ్చి నేరస్తురాలు జాదవ్ కాశీ భాయ్ ని కలిసి మృతురాలు అయినా జాదవ్ మమత @ వందన భాయి తన పిల్లలు రష్ణ (2 years), మరియు ఆరు నెలల బాబుతో పడుకొని ఉండగా అడే (A2)మాణిక్ రావు ఆమెను పట్టుకుని ఆమె చీరనే మెడ చుట్టూ కట్టి ఉరివేసి నాడు మరియు ఆమెను మంచం పై నుండి కిందికి లాగి తోసి వేయగా నేరస్తురాలు జాదవ్ కాశీ భాయ్ ఒక పెద్ద బండరాయితో ఆమె తల, నుదిటి మరియు గొంతుపై కొట్టి చంపినది. ఇదంతా మృతురాలి కూతురు రష్మా చూసి ఏడవడం మొదలుపెట్టడంతో నేరస్తులు అక్కడి నుండి వెళ్లి పోయినారు.

ఈ విషయంపై మృతురాలి తండ్రి రాథోడ్ ప్రేమ్ దాస్ ఇచ్చిన దరఖాస్తుపై నార్నూర్ పోలీసు వారు cr no 80/2017 U/Sec 352,302,498(A) r/w IPC కింద పైన తెలిపిన ముగ్గురిపై, మరియు ఇతర ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి సీఐ నార్నూర్  గణపతి జాదవ్ మరియు సిహెచ్ హనుక్ గార్లు విచారించి ముగ్గురు నేరస్తులు
A1) జాదవ్ కాశి భాయ్
A2) ఆడే మాణిక్ రావు లపై U/Sec 302,449,352,120-B r/w 34 IPC, మరియు
A3) జాదవ్ సుదాం పై U/Sec 498 A IPC, అండ్ సెక్షన్ 4 ఆఫ్ డౌరి ప్రొహిబిషన్ యాక్ట్ క్రింద చార్జిషీట్ వేసినారు. ఈ కేసు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో 225/2018 నమోదు చేసి విచారించడం జరిగినది. విచారణలో భాగంగా అడిషనల్ పి పి సంజయ్ వైరాగరే  20 మంది సాక్షలను కోర్టులలో విచారించి నేరం రుజువు అయినది అని నేరస్తులకు శిక్ష పడాలని వాదించినారు. ఈరోజు 14-07-2022 నాడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం రామకృష్ణ సునీత  తన తీర్పులు విలువరించి నేరస్తులు
A1) జాదవ్ కాశి భాయ్
A2) ఆడే మాణిక్ రావు లకు 302 IPC కింద జీవిత ఖైదు చెరో 2000 రూపాయల జరిమానా మరియు 449,120(B) IPC నేరం కింద ప్రతి నేరానికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 2 వేల రూపాయల జరిమానా ఇద్దరికీ వేసినారు. మూడు కేసులకు  6 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్షతో తీర్పు వెలువడించారు. A3 జాదవ్ సుదం పై నేరం రుజువు కానందున తనను విడిచిపెట్టడం జరిగింది.
ఈ కేసు నందు సాక్షులను ప్రవేశపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించిన కోర్టు లైను అధికారి ఎం గంగా సింగ్, కోర్టు డ్యూటీ అధికారి శ్రీనివాస్ లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!