*90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయినవి రిజర్వాయర్ అవసరం లేదు
*ఇప్పుడున్న ప్రాజెక్టుతో నాలుగు మండలాలకు సమృద్ధిగా నీరు అందించవచ్చును
*ముంపు ప్రాంత ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
*కేసులు పెట్టి గిరిజన రైతులను పోలీసులు వేధించవద్దు
*రైతులను అవమానించే విధంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు
*ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపి ప్రాజెక్టు పైన ఎంఎల్ఏ అవగాహన పెంచుకోవాలి
రిపబ్లిక్ హిందుస్థాన్ , నల్లబెల్లి:
మీ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం రంగయచెరువు ప్రాంత ముంపు గ్రామాలను ముంచే ప్రయత్నం చేయవద్దు, ఈ వ్యక్తిగత ఆదాయ వనరుల కోసం రంగయ్య చెరువు రిజర్వాయర్ కట్టాలని చెప్పి మొన్న ఉత్తంకుమార్ రెడ్డి గారి పర్యటనలో మీరే స్వయంగా మాట్లాడినటువంటి వీడియోలు బయటకు రావడం జరిగింది.దానికి ఆ ప్రాంత గిరిజన ప్రజలు అమాయక రైతులు తీవ్రమైన ఆందోళన చెంది మళ్లీ పాత రోజులు వచ్చినాయి, గతం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ రిజర్వాయర్ కట్టి వేల ఎకరాల భూములను ముంచి అనేక గ్రామాలను ముంపుకు గురిచేసి, అనాధలను చేయాలనుకున్నా కుట్రలు రైతుల మీద తుపాకులను ఎక్కుపెట్టించినవ్
ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారి ముందు మళ్లీ రిజర్వాయర్ గురించి మాట్లాడడం ఎందుకు,డిజైనింగ్ అయిపోయింది గత నాలుగు సంవత్సరాలుగా రెండో పంటకు రంగయ్య చెరువు నింపడం జరుగుతుంది , పాత ఆయకట్టుకు రెండు పంటలు పండుతున్నాయి.
ఇవాళ రైట్ మెన్ కెనాల్ (కుడి కాలువ నల్లబెల్లి,దుగ్గొండి)15000 ఎకరాలు .లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి (ఎడమ కాలువ నల్లబెల్లి,నర్సంపేట)10000 ఎకరాలు లింకు మెయిన్ కెనాల్ (నల్లబెల్లి,ములుగు ) కూడా 7500 ఎకరాలు, నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు చివరి దశకు వచ్చింది ఇవాళ మొత్తం పంప్ హౌస్ అయిపోయింది దాని సంబంధించిన పంపులు నుంచి నీళ్లు రావడం జరుగుతుంది. పాత ఆయకట్టు రైతులు లబ్ధి పొందుతున్నారు. కాలువలకు కూడా ప్రధాన కాలువలు రైట్ మెయిన్ కెనాల్ అంటే నల్లబెల్లికి , దుగ్గొండి మండలాలకు నీళ్లు వెళ్ళడనికి కాలువలు ఉన్నవి,ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది రిజర్వాయర్ సమస్య ఎవరు అడిగినారు మిమ్మల్ని మీ స్థానిక కాంగ్రెస్ నాయకులైన కనీసం మిమ్మల్ని అడిగినారా
సామాన్య రైతులు మీ దృష్టికి తీసుకు వచ్చినారా ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి రిజర్వాయర్ కావాలని మిమ్మల్ని అడిగినారా. ఎక్కడైనా ఈ నాలుగున్నర ఏళ్ల నుంచి ఆ చర్చ ఉన్నదా,నిన్న నీ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెడుతది రిజర్వాయర్ గురించి అలాంటి ఆలోచన లేదు దుష్ప్రచారం అంటారు.
మరి ముఖ్య విషయం మీడియా ద్వారా పోలీసులకు హెచ్చరించినది ఏమనగా
చట్టాలు మీకెంతో తెలుసొ మాకు కూడా అంతా తెలుసు
ఇవాళ రంగయ్య చెరువు ముంపు బాధితులకు సంబంధించినటువంటి రైతులకు ఆ గ్రామ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది.
కేసులు పెడతావా దమ్ముంటే నామీద కేసు పెట్టండి రిజర్వాయర్ కడదామంటే వాల్ల ఇల్లు, పంట పొలాలు మునుగుతాయి , వాళ్లు ఆందోళన చేస్తే కేసులు పెడతారా,
అన్ని నిరసనలకు నేనే బాధ్యున్ని ప్రజల భూములను ముంచి అవసరం లేనటువంటి ఎమ్మెల్యే స్వార్ధ రాజకీయ కాంట్రాక్టు కోసం తెర మీదికి తెచ్చే రిజర్వాయర్ వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటానికి నేనే బాధ్యున్ని.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్ మండల క్లస్టర్ బాధ్యలు మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments