◾️అధికారులు అడ్డుకుని చదును చేసిన లేవుట్లలో జోరుగా నిర్మాణాలు….
◾️అధికారులను లెక్క చేయని అక్రమార్కులు….
◾️ అధికారుల లెక్క సరిచేశారా….!? అనే అనుమానాలు….!
◾️ ప్రభుత్వ అదాయానికి కోట్లల్లో నష్టం… పైగా ప్రభుత్వం పై అదనపు భారం….
◾️ ఇచ్చోడా మండల కేంద్రంలో జరుగుతున్న అక్రమ లేవుట్ల పై ” రిపబ్లిక్ హిందుస్థాన్” ప్రత్యేక కథనం…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అక్రమ లే అవుట్లు ప్రజల ప్రాణాలు ఏవిధంగా గాల్లో కలిపెస్తున్నాయో ఏజెన్సీ ప్రాంతం ఇచ్చోడా మండల కేంద్రంలో సంభవిస్తున్న వరుస మరణాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ప్రభుత్వ నిభందనలు భే ఖాతరు చేస్తు లే అవుట్లను తీస్తున్నారు. అయితే ఇచ్చోడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పట్టణం కావడంతో చుట్టుపక్కల గ్రామాలు మరియు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి ఇచ్చోడ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. కొందరు చేసి గృహ నిర్మాణాలు సైతం చేస్తున్నారు. ఇచ్చోడా మండల కేంద్రం లో ప్లాట్లు కొని ఇల్లు కట్టుకుంటే భవిష్యత్తు లో మంచి ధరకు అమ్ముకోవచ్చనే భావన వ్యాపార అభివృద్ధి కోసం అనువైన మార్కెట్ కావడం తో ప్రజల ఆసక్తి మరింత పెరిగింది. హైదరాబాద్ వంటి నగరాలకు దీటుగా ఒక్కో ప్లాటు ధర పది లక్షల నుండి కోటిన్నర వరకు ఉందంటే ఇక్కడ రియాలిస్టేట్ వ్యాపారం ఏమేరకు జోరుమీద ఉందొ అర్థం చేసుకోవచ్చు.


రోజుకు రోజుకు ప్లాట్ల ధరలు రెట్టింపు అవుతుండడంతో ప్రజలు ప్లాట్లు కొనడానికి పోటీ పడుతున్నారు. అక్రమ లేఅవుట్ దారులకు ఇదే వరంగా మారింది. ఎక్కడ ప్లాట్లు తీసిన ఎలాగూ అమ్ముడుపోతాయని, ప్రభుత్వ నిభందనలు పాటించకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ఇష్టారీతిలో ప్లాట్లు తీసి సామాన్య ప్రజలకు అంటగడుతున్నారు. రోడ్డు సౌకర్యాలు మురికి కాలువల, కరెంటు సౌకర్యాలు, మరియు ప్రభుత్వ నిర్దేశిత ఖాళీ స్థలాలు అట స్థలాలు, పార్క్, ఓపెన్ రోడ్లు లేకుండా లే-అవుట్లు తీస్తున్నారు. నాలా అనుమతి తీసుకోని డిటిసిపి నియమాల ప్రకారం ప్రతి ప్లాటుకు ఇండ్ల నిర్మాణం కోసమైతే 5 ఫిట్లు మధ్యలో గ్యాప్ ఉండాలి, అదేవిధంగా కమర్శియల్ బిల్డింగ్ కోసం ప్లాటు విక్రాయిస్తే పాట్లు కు మరొక ప్లాటుకు 10 ఫిట్ల గ్యాప్ ఉండాలి. ఈ నిభందనలు ఎక్కడ కనిపించవు.








రోడ్డు, డ్రైనేజి వ్యవస్థ లేక….
అట్టి లే-అవుట్లలో నిర్మాణాలు చేసుకున్న వ్యక్తులు మురికి కాలువల వ్యవస్థ లేక విష జ్వరాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇచ్చోడా మండలంలో రెండు సంవత్సరాల నుండి ఏడు నుండి ఎనిమిది మంది వ్యక్తులు విష జ్వరాల బారిన పడి మరణించారు. గత రెండు నెలలో ముగ్గురు వ్యక్తులు విష జ్వరాల భారిన పడి మృతి చెందారు.
అయితే గతం లో విద్యానగర్, సుభాష్ నగర్ కాలనిలో వెలిసిన లే అవుట్లలో రోడ్డు, డ్రైనేజి వ్యవస్థలు లేకున్నా ప్రజలు నివాస భావనలు కట్టుకున్నారు.

అధికారులు చర్య తీసుకుని చదును చేసిన అక్రమ లే అవుట్లలో జోరుగా నిర్మాణాలు
ఒకప్పుడు అధికారులు ఓ పదిరోజుల పాటు హడావిడి చేసి అక్రమంగా వలేసిన లే అవుట్ల పై కోరాడ ఝాలిపిస్తున్నట్లు బ్లెడ్ ట్రాక్టర్ ద్వారా మొత్తం లే అవుట్లను చదును చేశారు. ఓ నెల రోజులు ఓపిక పట్టిన లే అవుట్ యజమానులు తరువాత తమ పనిని యదేఛ్చగా ప్రారంభించారు. అదిలాబాద్ డిఎల్పిఓ ధర్మారాణి సమక్షంలో గ్రామపంచాయతీ అధికారులు ట్రాక్టర్ తో అక్రమంగా వెలిసిన లేఅవుట్ల ను చదును చేశారు. ఎలాంటి క్రయావిక్రయలు జరపరాదని ప్లెక్సీ లు సైతం ఏర్పాటు చేశారు. క్రయావిక్రయాలు చట్టరీత్యా నేరం… అన్నారు…. ఇప్పుడు వాళ్ళే జిపి రికార్డులో నమోదు చేసుకుంటున్నారు .
అయితే ఏ గ్రామపంచాయతీ అధికారులయితే ఇవి అక్రమ లే అవుట్లు అని ప్లెక్సీ లు పెట్టారో ఆ అధికారులే అక్రమ లే అవుట్ల ప్లాట్లకు జిపి నుండి ఇంటి పన్ను, ఇంటి నెంబర్ రశిదు ఇచ్చేస్తున్నారు. అయితే ఫ్లెక్సీ లు అధికారుల వ్యక్తిగత అదాయాన్ని 50శాతం మేర పెంచేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ఒక ఇంటికీ జిపి రికార్డులో నమోదు చేసుకుని ఇంటి పన్ను రశిదు ఇవ్వడానికి 3 నుండి 6 వేల రూపాయల వరకు వసూలు చేసుకునే అధికారులు పంచాయితీ సిబ్బంది ఇప్పుడు ఎకంగా 10 రూపాయలకు పైగా తీసుకుంటున్నారని సమాచారం.
అధికారుల ద్వంద వైఖరితో అయోమయంలో ప్రజలు
అక్రమం అని ఫ్లెక్సీలు పెట్టిన అధికారులే నెమ్మదిగా జిపి నుండి అన్ని పత్రాలు జారీ చేస్తుండడం తో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అధికారుల ద్వంద వైఖరి అర్థం కాకా, అంతేలే అని సామాన్యులు ఒకరికొకరు పోటాపోటీగా ప్లాట్లు కొంటున్నారు.
అధికారులు మామూళ్ల మత్తులో జోగి అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు. చర్యలు తీసుకున్నట్లే తీసుకుని మళ్ళీ అంత ఒక్కటే అని నిరూపిస్తున్నట్లున్నారు అధికారులు.


ఏజెన్సీ చట్టానికి లెక్క చేయకుండా క్రయావిక్రయాలు జరుగుతున్న అటువైపు చూసి చూడనట్లుగా అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నారు.
గతం లో ట్రాక్టర్ తో అక్రమ లే అవుట్లను చదును చేసినట్లు పత్రికల్లో తమ వార్తలు రాయించుకుని తీరా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఎంతో కొంత ప్యాక్ ఇచ్చి తీసుకొని ఆ తర్వాత ఆ వైపు కన్నెత్తి చూడరని ప్రజల్లో వినికిడి. పత్రికల్లో మాత్రం మేము కఠిన చర్యలు తీసుకున్నామని అక్కడ ఎలాంటి ప్లాట్ల విక్రయాలు జరగడం లేదని పత్రికాముఖంగా తెలియజేస్తారూ అధికారులు. కానీ వాస్తవంగా జరిగేది వేరే. ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్నది ఒకప్పుడు కానీ ఓ నెల రోజుల తర్వాత మామూలు సంగతిగా ఆక్రమ లేవుట్లలో ప్లాట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. అక్కడితో ఆగకుండా అందులో నిర్మాణాలు కూడా అదే విధంగా కొత్త లే అవుట్లు కూడా పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి. కట్టడాలు మళ్లీ మొదలయ్యాయి అయితే ఆ తర్వాత అధికారులు కనీసం ఆ ప్రదేశం వైపు కన్నెత్తి చూడడం లేదు నిర్మాణాలు చేపట్టినా కూడా అధికారులు ఆ వైపుగా చూడకపోవడంతో ప్రజలలో అధికారులపై అనుమానాలు కలుగుతున్నాయి వాటిలలో జోరుగా నిర్మాణాలు సైతం కొనసాగుతున్నాయి ఏజెన్సీ ఇచ్చోడా మండల ఏజెన్సీ ప్రాంతం కావడంతో అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు తీస్తే ప్రభుత్వం కచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకొని అందులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా చూడాలి. అధికారులు అలా చేయడం లేదు ప్రభుత్వ ఆదాయానికి సైతం కోట్ల రూపాయల గండి పడుతుంది. పైగా ప్రభుత్వం పై అదనపు భారం ఒకటి .
ప్రభుత్వ అదాయానికి కోట్లలో గండి…. పైగా కోట్ల రూపాయల అదనపు భారం
ఇచ్చోడా మండల కేంద్రం లో ఒక్కో ప్లాటు ధర పది నుండి మొదలు కొని కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇన్ని కోట్లు తీసుకున్న సదరు లే అవుట్లలో మాత్రం సౌకర్యలు శూన్యం. గ్రామపంచాయతీ అధికారుల కక్కుర్తి కీ ప్రభుత్వ ఖాజానకి కోట్లలో నష్టం జరుగుతుంది. పైగా అక్రమ లే అవుట్లలో గృహ నిర్మాణాలు జరిగిపోవడం తో ప్రభుత్వం నిధులతో సదరు లే అవుట్ కాలనీల్లో రోడ్లు, మురికి కాలువల నిర్మాణం వల్ల ప్రభుత్వాన్నికి కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.
ఏజెన్సీ ప్రాంతం కావడం తో కేవలం ఇంటి పన్ను రశిదు దొరికితే చాలు అనుకునే గిరిజనేతరుల నుండి వేలలో డబ్బులు వసూలు చెసి ఇంటి నెంబర్ కేటాయిస్తున్నారు. ఇందుకు ఎప్పుడు గ్రామపంచాయతీ ఉంటు చక్రం తిప్పే ఓ మాజీ ప్రజాప్రతినిది దగ్గరుండి ఇంటి నెంబర్లు, రశిదు ఇప్పిస్తున్నట్లు సమాచారం.
అక్రమాలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారుల పై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Recent Comments