– మల్టీ జోన్- 1 ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
◾️ కేసుల నందు సరైన పరిశోధన, నేరాలు జరగకుండా ముందస్తు సమాచారం పోలీసు వ్యవస్థలో కీలకమైన అంశాలు
◾️ఆదిలాబాద్ జిల్లా కు విచ్చేసిన మల్టీ జోన్ వన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
◾️పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ సహా పోలీసు ◾️ఉన్నతాధికారులతో, పోలీసు కార్యాలయం సిబ్బందితో సమావేశం
◾️ స్థానిక సాయుధ హెడ్ క్వార్టర్స్ సందర్శన, నూతనంగా నిర్మించబడుతున్న భరోసా సెంటర్ నిర్మాణ పనుల పరిశీలన
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి మొదటిసారిగా విచ్చేసిన మల్టీ జోన్ 1 ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారిని పుష్పగుచ్చాలతో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. మొదటగా స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ నందు ఆర్ఎస్ఐ మహేందర్ నేతృత్వంలోని సాయుధలం, ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గౌరవ వందనాన్ని సమర్పించారు.
సోమవారం ఉదయం పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో, పోలీసు కార్యాలయం సిబ్బందితో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో ముందస్తు సమాచారాన్ని సేకరించడం కీలకమైన అంశమని పేర్కొన్నారు. న్యాయస్థానాల యందు నేరస్తులకు శిక్షల శాతం పెరిగేలా కేసుల దర్యాప్తును, పరిశోధనను నిర్వహించినప్పుడు సమాజంలో నేరాల సంఖ్యను తగ్గించ గలమని తెలిపారు. న్యాయస్థానాలయందు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాక్షాధారాలను వినియోగించడం వల్ల న్యాయస్థానంలో శిక్షల రుజువు శాతం పెంపొందించవచ్చని తెలిపారు. అదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుతో ఉంది కావున అంతర్రాష్ట్ర నేరస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున జాతీయ రహదారులపై ఎల్లప్పుడూ పెట్రోలింగ్ నిర్వహిస్తుండాలని, జిల్లా వ్యాప్తంగా సిసిటీవీల కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లో నందు డైల్ 100, బ్లూ కోర్ట్ నిర్వర్తించే అధికారులు ఎల్లవేళలా అప్రమత్తమై ఉండాలని తెలిపారు. ఎటువంటి సందర్భంలోనైనా సంఘటనా స్థలంలో ఐదు నిమిషాల లోపు పోలీసులు చేరుకునేలా ప్రజలకు నమ్మకం కలిగే విధంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లో నందు 16 వర్టికల్స్ ను సక్రమంగా నిర్వహించాలని, 5S ను పాటిస్తూ పోలీస్ స్టేషన్ పరిసరాలలో ఆకుపచ్చదనాన్ని పెంపొందించే విధంగా చెట్లను పెంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చే విధంగా పోలీసు వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని పెంపొందించే విధంగా దర్యాప్తును చేపట్టాలని సూచించారు. అనవసరంగా అనుమానితులను, సాక్షులను పోలీస్ స్టేషన్ లకు పిలిచి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించ వద్దు అన్నారు. పోలీస్ స్టేషన్ ను ఒక ప్రార్థన స్థలం నిర్వహించే పద్ధతిలోనే నిర్వహించాలని తెలిపారు. ఒకప్పటి పోలీసు వ్యవస్థ ప్రస్తుత పోలీసు వ్యవస్థ కాలానుగుణంగా మారుతూ వస్తుందని ప్రజలతో వ్యవహరించే తీరును మార్చుతూ ప్రజలతో ఉన్న సత్సంబంధాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రతివారం సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నూతన వాహనాలను సరైన సమయాలలో సర్వీసింగ్ నిర్వహిస్తూ సక్రమంగా ఉంచాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా మట్కా, గంజాయి, పేకాట, వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతమొందించాలని తెలిపారు. జిల్లాలో మతసామరస్యం పెంపొందించే విధంగా పోలీసు కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. విధుల నందు నిర్లక్ష్యం వహించిన, ఎటువంటి ఆసంగీక కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా పోలీసు ముఖ్య కార్యాలయం సిబ్బందితో మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించాలంటే వారికి వచ్చే ప్రయోజనాలు సరైన సమయంలో వచ్చినప్పుడే సాధ్యమైతుందని తెలిపారు. పోలీసు సిబ్బందికి సరైన సమయంలో సెలవులు కానీ, అత్యవసర సమయంలో సిబ్బంది తీసుకునే లోన్లు తదితర అంశాలు వెనువెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్ఆర్ఎంఎస్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం) ను ప్రతిరోజు ఎటువంటి కాలయాపన లేకుండా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పోలీసు అసోసియేషన్ తరపున అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్ ఐజి గారికి పూల మొక్క అందించి శాలువా తో సత్కరించారు. అదనపు ఎస్పీలు బి రాములు నాయక్, సి సమయ్ జాన్ రావు, డీఎస్పీలు వి ఉమేందర్, ఉమామహేశ్వరరావు, పోతారం శ్రీనివాస్, కార్యాలయం ఏవో యూనుస్ అలీ, సూపరిండెంట్లు జోసెఫిన్, గంగాధర్, సీసీ దుర్గం శ్రీనివాస్, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments