ఆగ్రహం వ్యక్తం చేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్….
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగి , మాదిగలకు విద్యా రంగాల్లో కేసీఆర్ నిట్టనిలువునా మోసం చేస్తూ అవమాన పరచడం జరుగుతుందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి ప్రశాస్వామిక పోరాటాలు చేసి సాదించుకున్న తెలంగాణలో రాష్ట్రం సాధించే ప్రక్రియలో మొదటి వరుసలో మాదిగలు గజ్జె కట్టి ధూమ్ ధామ్ చేసి జైల్ కెళ్లిన వారిలో అధికశాతం మాదిగలు ఉన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన వారిలో కూడా అధిక శాతం మాదిగలే ఉన్నారుమ్ . ఈ రకంగా పోరడినా మాదిగలకు విద్యరంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 యూనివర్శిటిలలో ఇప్పటి వరకు వైస్ చాన్సలర్ , కాని రిజిష్టర్ లు , కాని , ఉన్నత విద్యమండలి ఛైర్మన్ నియమించలేదు. సమర్థవంతమైన ప్రొపెసర్లు ఉన్నప్పటికి ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం బాధాకరంగా భావిస్తున్నామని అన్నారు .
Thank you for reading this post, don't forget to subscribe!ఈ విధానం ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో వ్యాప్తంగ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నెత్రుత్వంలో టీఆరెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సినియర్ నాయకులు దుబ్బాక సుభాష్, సిరిసిల్ల భూమయ్య, కల్లె పల్లె గంగయ్య , మచ్చ పోశెట్టి , బాబి మల్లేష్ . కొత్తూరి సంజీవ్, రాజ్ కుమార్ , గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Recent Comments