క్షమాపణ కోరిన ఇచ్చోడ ఎంపిపి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఏజెన్సీ చట్టాల జోలికి వెళ్లనని ఇకముందు ఆదివాసీల పై ఎలాంటి వాఖ్యలు చేయనని ఇచ్చోడ ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి యావత్ ఆదివాసీ సమాజానికి క్షమాపణలు కోరాడు .
ఎంపిపి ఏజెన్సీ చట్టాలను, ఆదివాసులను ఉద్దేశించి మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఒకటి వైరల్ కావడం తో, ఆదివాసీలను కించపరిచే విధంగా మాట్లాడి నట్లు గుర్తించిన ఆదివాసీలు ఎంపిపి పై కోపం తో రగిలి పోయారు. ఇదే విషయం పై మెడిగూడ రాయి సెంటర్ లో సమావేశం ఏర్పాటు చేశారూ. అయితే ఈ సమావేశానికి ఎంపిపి ప్రితం రెడ్డి వెళ్లి, తాను మాట్లాడింది తప్పు అని, ఇకనుండి ఇలా మాట్లాడను అని, అందరికి క్షమాపణలు కోరాడు.
కార్యక్రమం లో మెడిగూడ రాయ్ సెంటర్ సార్మేడి మెస్రం శంభూ, ఉప సార్మేడి జ్యోతి రామ్, సలహాదారులు కుంరం కోటేశ్వర్, ఏజెన్సీ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం మహేందర్, ఉపాధక్షుడు,మాడవి భీం రావ్, సిడం మురళి కృష్ణ, కొడప్ జలై జాకు, దేవ్ రావ్, విఠల్, జగపతి మరియు దేవురీలు, పటేల్లు, ప్రజలు పాల్గొన్నారు.


Recent Comments