రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
బోథ్ మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీ లో బృహత్ పల్లె ప్రకృతి వనం లో ఎంపిడిఓ రాధా రాథోడ్ మరియు సర్పంచ్ సింధూ విశ్వేశ్వర్రావులు మొక్కలను నాటారు. ఎంపీడీవో రాధ రాథోడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కరత్వాడ లో ఐదు ఎకరాలలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి దాదాపు మూడు వేల మొక్కలను నాటడం జరుగుతుందని తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి నేలను వెంటనే చదును చేయించిన సర్పంచును ఎం పి డి ఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింధూ విశ్వేశ్వర్ రావు,ఏ పీ ఓ, శ్యామ్,పంచాయతీ కార్యదర్శి చార్లెస్ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Recent Comments