Wednesday, February 12, 2025

Match fixing : ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణి కలకలం…..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిన ప్రలోభాలా పర్వం!?

తెర పై ఎమ్మెల్సీ ఎన్నికల వేళ డబ్బుల పంపిణి వ్యవహారం
◾15 రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తుడుందెబ్బ కమిటీ ఎన్నిక….
◾తుడుందెబ్బ సంఘం పేరు వాడుకుని అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకోవడం సరైంది కాదు…
◾ఐదుగురిని తుడుందెబ్బ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నాం.
◾ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న ఫోటోలు విడుదల.

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఇటివల జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో ఆదిలాబాద్ జిల్లా రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది . ఎన్నిక జరిగి నెల రోజులు గడిచిన తర్వాత తుడుం దెబ్బ రాష్ట్ర కమిటి సభ్యులు సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన తుడుందెబ్బ నాయకులు బలపరిచిన స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పుష్ప రాణికి ఆ సంఘం రాష్ట్ర కార్య వర్గం పెద్ద షాక్ ఇచ్చింది.

శనివారం జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ఎన్నికల సమయంలో జరిగిన అంశాలపై సంచలన వివరాలను వెల్లడించారు.

పాత్రికేయుల సమావేశం లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ డబ్బలు తీసుకుంటున్న ఫొటోలో విడుదల చేస్తున్న తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తుడుందెబ్బ జిల్లా కమిటీ సభ్యులు సంఘం పేరును వాడుకుని అధికార పార్టీ నుండి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అనుకూలంగా తుడుం దెబ్బ సంఘాన్ని వాడుకున్నారని ఆరోపిస్తూ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షుడు గేడం గణేష్ తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన పెందూర్ పుష్పరాణి, వెట్టి మనోజ్, పుర్కబాపురావు, గోడం రేణుకలను కార్యవర్గం నుండి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తీర్మానం సైతం జరిగిందని పేర్కొన్న ఆయన..సదరు నాయకులూ డబ్బులు తీసుకున్న సమయంలో తీసిన ఫోటోలను బహిర్గతం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి దిగిన పోటోలను మీడియాకు విడుదల చేశారు.

ఎమ్మెల్సీ నామినేషన్ మొదలు విత్ డ్రా, ఎన్నిక అంతట డ్రామా
ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని గుసగుసలు . నామినేషన్ మొదలు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహారణ వరకు అంత ఓ డ్రామాలా కొనసాగింది. ఓ పార్టీ నాయకులు తెగ హడావిడి చేసి తీరా ఎన్నిక రోజు కనీసం ఓటు కూడా వేయకపోవడం తో ప్రజల్లో అప్పట్లోనే అనుమానాలు బలంగా నాటుకు పోయాయి. ఇప్పుడు డబ్బులు చేతులు మారుతున్నా ఫోటోలతో అదే నిజమైనట్లయింది.

15 రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తుడుందెబ్బ కమిటీ ఎన్నిక….
◾తుడుందెబ్బ సంఘం పేరు వాడుకుని అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకోవడం సరైంది కాదు…..
◾ఐదుగురిని తుడుందెబ్బ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నాం.
◾ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న ఫోటోలు విడుదల.

ఆదిలాబాద్ : ఇటివల జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో ఆదిలాబాద్ జిల్లా రాజకీయల్లో హీట్ పుట్టించింది.ఎన్నిక జరిగి నెల రోజులు గడిచిన తర్వాత తుడుం దెబ్బ రాష్ట్ర కమిటి సభ్యులు సంచలన ప్రకటన చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన తుడుందెబ్బ నాయకురాలైన పుష్ప రాణికి ఆ సంఘం రాష్ట్ర కార్య వర్గం పెద్ద షాక్ ఇచ్చింది.శనివారం జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ఎన్నికల సమయంలో జరిగిన అంశాలపై సంచలన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తుడుందెబ్బ జిల్లా కమిటీ సభ్యులు సంఘం పేరును వాడుకుని అధికార పార్టీ నుండి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అనుకూలంగా తుడుం దెబ్బ సంఘాన్ని వాడుకున్నారని ఆరోపిస్తూ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షుడు గేడం గణేష్ తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన పెందూర్ పుష్పరాణి,వెట్టి మనోజ్,పుర్కబాపురావు,గోడం రేణుకలను కార్యవర్గం నుండి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.ఈ మేరకు తీర్మానం సైతం జరిగిందని పేర్కొన్న.ఆయన..సదరు నాయకులూ డబ్బులు తీసుకున్న సమయంలో తీసిన ఫోటోలను బహిర్గతం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నాయకులతో దిగిన పోటోలను మీడియాకు విడుదల చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధనప్రవాహం జరిగిందని మరోసారి రుజువైంది.ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ తుడుం దెబ్బ సంఘం బలపరిచిన అభ్యర్థి పుష్పరాణి మరియు గోడం గణేష్ తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు ఆదివాసుల ఆత్మ గౌరవన్ని తాకట్టు పెట్టారని డబ్బులకు అమ్ముడు పోయారని ఆదివాసీ వర్కింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.

డబ్బులు తీసుకుంటున్న ఫోటోలను విడుదల చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అయినా టీఆర్ఎస్ నుండి డబ్బులు తీసుకున్నట్టు నలుగురి పైన తుడుం దెబ్బ ఆదివాసీ కమిటీ వేటు వేసింది.త్వరలోనే తుడుం దెబ్బ కొత్త కమిటీ వేస్తామని ఆయన అన్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి కి డబ్బులు పంపిణి వ్యవహారం

భారీగా డబ్బులు చేతులు మారినట్లు సమాచారం…

డబ్బులు తీసుకున్న తుడుం దెబ్బ నాయకులను కమిటీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన రాష్ట్ర కమిటీ….


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి