ఆదిలాబాద్ జిల్లా : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ హాజరయ్యారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య పాల్గొన్నారు.
ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్ లలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, పెండింగ్ లో ఉన్న డీఏ చెల్లించాలని, రెగ్యులర్ ఎమ్ఈఓ, డీఈఓ లను నియమించాలని, ట్రైబల్ స్కూల్స్ లో ఉపాద్యాయులకు, సిబ్బంది లకు వారంతపు సెలవు మంజూరు చేయించాలని, ఉద్యోగ విరమణ వయస్సు పెంచకుండ చూడాలని, జీఓ 50 ని ఖచ్చితంగా అమలు చేయాలని పలువురు ఉపాద్యాయులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య దృష్టికి తీసుకెళ్లారు.
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ విద్యారంగం లో చాలా సమస్యలు వున్నాయని సర్వీసు, పాలసీ విషయంలో ఎన్నో ఏళ్లుగా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని తెలిపారు. ఏ శాఖలో లేని విధంగా కేవలం విద్యాశాఖ కే రాజ్యాంగ పరంగా ఎమ్మెల్సీ ని కేటాయించడం ఈ శాఖ చేసుకున్న అదృష్టం అని ఎంపీ అన్నారు. బీజేపీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాద్యాయులను ఎంపీ నగేష్ కోరారు.
బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పనైనది సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం లాంటి గొప్పవాళ్లు ఉపాధ్యాయ వృత్తి నుండే వచ్చారని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలు ఆలోచించే అంబేద్కర్ మీ కోసం ఎమ్మెల్సీ పదవిని రాజ్యాంగం లో రాశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వంలో నలభై సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థను మార్చలేదని బీజేపీ ప్రభుత్వం 2020 జాతీయ విద్యా విధానం ను తీసుకు వచ్చిందని కొమరయ్య తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు నూతన విద్యా విధానం ను అమలు చేయకుండ ఆ ఫైల్ ని పక్కన పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర విద్యా విధానం ను అమలు చేయకుండ జాప్యం చేస్తుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అబివృద్ధి లో ప్రపంచ దేశాల్లో పదో స్థానం నుండి అయిదో స్థానం కు చేరిందని ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం గా భారతదేశం వుందని కొమరయ్య తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments