రిపబ్లిక్ హిందుస్థాన్,ఇంద్రవెల్లి : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 59 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్, ఎంపీపీ పోటే శోభబాయితో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్ మాట్లాడుతూ ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ జాదవ్ శ్రీరాంనాయక్,ఎంపీటీసీలు కోవా రాజేశ్వర్,గిత్తే ఆశబాయి,జాదవ్ స్వర్ణలతా,సర్పంచులు శారదా,తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments