
రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యలను తెలుసు కునేందుకు ఎమ్మెల్యే జోగురామన్న ఇంటింటికి వెళ్లి కలుస్తున్నారు.వార్డ్ వాచ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీ, ఖుర్షిద్ నగర్ కాలనీలలో పలువురు అధికారులు,కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు.కాలనీ వాసులు మిషన్ భగీరథ నీటి సరఫరా ఇబ్బందులపై ఎమ్మెల్యేకి విన్నవించడం లో ప్రజల విన్నపం మేరకు ఇంటింటికి కాలినడకన తిరుగుతూ మిషన్ భగీరథ సరఫరాపై ఆరా తీశారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు పలువురు మహిళలు తైలకం దిద్ది సాధారంగా స్వాగతం పలికారు. మహిళలతో మాట్లాడి నీటి సరఫరాతో పాటు ఇతర సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పైప్ లైన్ లీకేజి కారణంగా కొన్ని చోట్ల గుంతలు తోవ్వడం జరిగిందని, వాటిని పుడ్చడానికి కొంత సమయం పడుతుందని ప్రజలు సహకరించగలరు అని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శైలజ, మున్సిపల్ ఈఈ, వాటర్ గ్రిడ్ అధికారి గోపీచంద్, పలువురు కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments