రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : శుక్రవారం రోజు గుడిహత్నూర్ మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ నాగుల సతీష్ గత కోన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రెండు
ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు.
హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో ప్లాస్టిక్ సర్జరీ అయ్యి తిరిగి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొన్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులతో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. సతీష్ త్వరగా కోలుకోవాలని అన్నారు. వీరి వెంట మండల కన్వీనర్ బ్రహ్మానంద్ తో పాటు మండల బిఅరెస్ నాయకులు ఉన్నారు.

గాయపడిన జర్నలిస్ట్ సతీష్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి జాధవ్ బలరాం నాయక్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గలా కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Recent Comments