
రిపబ్లిక్ హిందుస్థాన్, పెద్దపల్లి : మిషన్ భగీరథ నీటితో లాభాలు అనేకం గా ఉన్నాయని మిషన్ భగీరథ ఈ ఈ శ్రీనివాస్ అన్నారు . పెద్దపెల్లి మండలం లోని హనుమంతుని పేట గ్రామంలో సోమవారం మిషన్ భగీరథ 100 రోజుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి ద్వారా ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయని అన్నారు. ఈ నీటిని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వాడుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని, ప్రతి పాఠశాలను సందర్శించి ఓవర్హెడ్ ట్యాంకు లను నిర్మాణం చేసే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో మిషన్ భగీరథ కోసం ప్రత్యేక నీటి నిల్వలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ మధు గ్రామ సర్పంచ్ తీగల సదయ్య, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి-గట్టెష్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, ల్యాబ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments