ఎంఐఎం పార్టీ అదినేత అల్ హజ్ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారి పై జరిగిన దాడిని ఖండించిన ఇచ్చోడ ఎంఐఎం మాజీ మండల అధ్యక్షులు షైక్ మొసీన్
Thank you for reading this post, don't forget to subscribe!
ఉత్తరప్రదేశ్ లోమజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు చేసిన ఘటనపై ఇచ్చోడ మండల మాజీ అధ్యక్షుడు షైక్ మొసీన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ బరిలో దిగిన విషయం తెల్సిందే.ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇది కొంతమంది దుండగులు జీర్ణించుకోలేక ఉత్తరప్రదేశ్ లోని టోల్ గెట్ వద్ద అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై మూడు నాలుగో రౌండ్లు కాల్పులు జరిపారు. దేవుని దయ వల్ల అసదుద్దీన్ ఓవైసీ కి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అన్నారు.ప్రతి ఒక్కరు అసదుద్దీన్ ఒవైసీ కోసం ప్రార్ధనలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మరో సారి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రతి ఒక్కరు అసదుద్దీన్ ఒవైసీ కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని ఆయన కోరారు.
Recent Comments