🔶 అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ చేసిన సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు
🔶 వివరాలు వెల్లడించిన స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ జె కృష్ణ మూర్తి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లాలో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలానే జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్, సిసిఎస్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఒక లక్ష రూపాయల విలువ చేసే రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్పెషల్ బ్రాంచ్ సిఐ జె కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో గుట్కా ఉందని విశ్వసనీయ సమాచారం మేరకు అంబేద్కర్ చౌక్ నందు గల లిమ్ర మసీద్ వద్దగల అస్లాం ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహించగా నిందితుడు భూషన్ త్రిపాటి (38) s/o రామ్ నారాయణ కు సంబంధించిన రూపాయలు ఒక లక్ష విలువచేసే రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా లభించిందని నిందితున్ని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కోసం అప్పగించడం జరిగింది అని తెలిపారు. ఈ ఆపరేషన్లు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ లు ఎస్ అశోక్, కె విట్టల్, సిసిఎస్ సిబ్బంది గంగారెడ్డి, హనుమంత రావు, రాహత్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments